జగన్‌కు జైలు తప్పదు… కానీ ఎప్పుడు… ఎన్నేళ్ళు?

pawan-kalyan-chandrababu-naidu-ap-assembly

రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఇకపై రాబోయే 5 ఏళ్ళలో తాము ఏమి చేయాలనే ఆలోచనలు చేయాలి. తమ ప్రభుత్వం విధానాలు రూపొందించుకోవాలి. అభివృద్ధి, సంక్షేమ పధకాలకు నిధులు సమకూర్చుకోవాలి.

కానీ ఇప్పుడు అంతకంటే ముందు గత ప్రభుత్వం చేసిన ఆర్ధిక, పారిశ్రామిక, సామాజిక విధ్వంసం గురించి ఆలోచించవలసి వస్తోంది. ఆ తప్పులను, లోపాలను సవరించుకోవలసి వస్తోంది. ఆ సమస్యలను అధిగమించి ఏవిదంగా ముందుకు సాగాలా? అని ఆలోచించవలసి వస్తోంది.

ADVERTISEMENT

ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ దశలోనే ఉంది. తాను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో దశలవారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుచేస్తానని చెప్పిన జగన్‌, మద్యం వ్యాపారంతోనే వేలకోట్లు పోగేసుకున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

సిఎం చంద్రబాబు నాయుడు నిన్న శాసనసభలో మద్యంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో పాల్గొన్న పవన్‌ కళ్యాణ్‌ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిఎం చంద్రబాబు నాయుడుగారు విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం మద్యం వ్యాపారం ద్వారా గత 5 ఏళ్లలో జగన్‌ రూ.18,861 కోట్లు దోచుకున్నారు. కానీ లోతుగా విచారణ జరిపిస్తే అంతకు రెట్టింపు దోపిడీ జరిగి ఉండవచ్చని తెలుస్తుంది.

ఓ ప్రభుత్వోద్యోగి అవినీతికి పాల్పడితే వెంటనే ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేసి చర్యలు తీసుకుంటాము. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ వేలకోట్ల అవినీతికి పాల్పడితే ఎటువంటి శిక్ష, చర్యలు తీసుకోకుండా ఎలా విడిచిపెట్టగలం? అమరావతికి కేంద్రం రూ.15,000 కోట్లు ఇచ్చి నందుకు సంతోషపద్దాము. కానీ జగన్‌ దోచుకున్న సొమ్ముని తిరిగి రాబట్టగలిగితే అమరావతి నిర్మాణానికి సాయపడమని కేంద్రాన్నివేడుకోనవరమే లేదు కదా?

కనుక దీనిపై లోతుగా విచారణ జరిపించి జగన్‌ ప్రభుత్వం ఎంత దోపిడీ చేసిందో లెక్కలు తీసి, దోచుకున్న సొమ్మునంతా తిరిగి రాబట్టాలి. కల్తీ మద్యం త్రాగి ఆరోగ్యం చెడగొట్టుకొని ఆస్పత్రులపాలైనవారికి వైద్యం అందించేందుకు ఆ సొమ్ముని ఖర్చు చేయాలని కోరుతున్నాను,” అని అన్నారు.

సీనియర్ టిడిపి నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ చర్చలో మాట్లాడుతూ, “లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం, డెప్యూటీ సిఎం అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. ఆ లిక్కర్ స్కామ్‌లో సుమారు రూ.200 కోట్లు అవినీతి జరిగిందని ఈడీ, సీబీఐ వాదిస్తున్నాయి.

ఆ లెక్కన సుమారు రూ.30,000 కోట్ల అవినీతికి పాల్పడిన మాజీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి ఎన్నేళ్ళు జైల్లో పెట్టాలి? అసలు ఆయన, వైసీపి నేతలు దోచుకున్న ఆ సొమ్ముని అంతా ఏవిదంగా రాబట్టాలో ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నాను,” అని అన్నారు.

సిఎం చంద్రబాబు నాయుడు సభ్యుల సూచనలపై స్పందిస్తూ, “జగన్‌ తన స్వార్ధం కోసం రాష్ట్రంలో పేద ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. కల్తీ, నాసిరకం మద్యం ఎన్నో వేలమంది ఆస్పత్రులు పాలయ్యారు. వారి జీవితాలను నాశనం చేసి జగన్, వైసీపి నేతలు వేలకోట్లు పోగేసుకోవడం చాలా శోచనీయమని అన్నారు. దీనిపై అవసరమైతే ఈడీ విచారణకు ఆదేశిస్తాను. ఎట్టి పరిస్థితులలో ఈ మద్యం అక్రమాలు, అవినీతిని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ADVERTISEMENT
Latest Stories