
ఉర్దూలో ఓ సామెత ఉంది. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్రకు బయలుదేరిందని. శుక్రవారం పర్యావరణ దినోత్సవం సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొక్క నాటుతూ తీసుకున్న ఫోటోని చూసిన వెంటనే ఈ ఉర్దూ సామెత గుర్తు వస్తే ఆశ్చర్యం లేదు.
బటన్ నొక్కుడు సభల కోసం బయటకు వస్తే చుట్టు పక్కల పచ్చటి చెట్లని నరికించేస్తూ, పర్యావరణానికి తీరని నష్టం కలిగించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే. గత 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పచ్చదనం తగ్గిందంటే దానికి ఏకైక కారకుడు జగన్, పచ్చటి చెట్లను పెకలించేసి కొండలు గుట్టలు తవ్వేసుకున్న వైసీపీ నేతలే.
Also Read – వైసీపీ..బిఆర్ఎస్ ఇద్దరిది అరెస్టుల రాజకీయమేనా.?
ఓ ముఖ్యమంత్రిగా సొంత రాష్ట్రానికి తీరని అపకారం చేసిన జగన్ ఇప్పుడు ఓ మొక్క నాటి సోషల్ మీడియాలో ఆ ఫోటో పెట్టుకునంత మాత్రాన్న పర్యావరణానికి ఆయన చేసిన నష్టం ఎవరూ మరిచిపోలేరు.
ఓ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలసిన జగన్, ఏ ముఖ్యమంత్రి చేయనంత అపకారం చేయడమే కాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో “ఈ భూమండలాన్ని ప్లాస్టిక్ భూతం కమ్మేస్తోంది. ప్లాస్టిక్‌ను నిరోధించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ఐక్యరాజ్యసమితి ఇచ్చిన సందేశం అత్యంత ప్రాధాన్యమైనది. పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ ఇమిడి ఉందనేది అక్షర సత్యం – దీనికి మనమంతా బద్ధులై ఉండాలని ఆశిస్తున్నాను,” అంటూ సందేశం పెట్టడం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా?