Jagan Using QR Code For Recalling Chandrababu Manifesto Programme

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని వాడుకోవడంలో ముందుంటారు. విశాఖలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సుమారు 3 లక్షల మంది హాజరు కాగా, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 కోట్ల మంది హాజరయ్యారు.

ఇన్ని లక్షలు, కోట్ల మంది వివరాలు రికార్డ్ చేయడానికి ఆయన ‘క్యూఆర్ కోడ్’ వాడుకొని అన్ని సులువుగా చక్కబెట్టేశారు.

Also Read – భువి నుంచి దివికి ఒక తార.. దీవి నుంచి భువికి మరో తార!

ఇన్ని లక్షల మందితో ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా నిర్వహించడం చూసి ప్రధాని మోడీ కూడా ఆశ్చర్యపోయారు. చాలా సంతోషపడ్డారు. సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లను ప్రశంశించారు కూడా.

కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్ళలో సంక్షేమ పధకాల గోల తప్పితే మరేమీ తెలుసుకోలేదు. నేటికీ అదే గోల.

Also Read – ఇండోసోల్ నిర్వాసితులను జగనే కాపాడాలట!

ఇప్పుడు పదవీ, అధికారం రెండూ కోల్పోయిన తర్వాత జగన్‌ తొలిసారిగా ‘క్యూఆర్ కోడ్’ వాడుకునేందుకు సిద్దమయ్యారు.

సిఎం చంద్రబాబు నాయుడు పేరుతో, “రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ అనే కార్యక్రమం ప్రకటించారు. 5 వారాల పాటు సాగే ఈ కార్యక్రమంలో తన హయంలో, ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు హయంలో సంక్షేమ పధకాల లాభ నష్టాలని ప్రజలకు వివరించేందుకు క్యూఆర్ కోడ్ వాడుకోబోతున్నారు.

Also Read – కమల్‌ హాసన్‌కి మాత్రమే న్యాయం…. చాలుగా!

అంతర్జాతీయ యోగా దినోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం ‘క్యూఆర్ కోడ్’ ఉపయోగించింది కనుక ఎవరికీ దానిపై సందేహాలు కలుగలేదు. ఇలాంటి విషయాలపై వేలెత్తి చూపడంలో ఎప్పుడూ ముందుండే వైసీపీ కూడా ‘క్యూఆర్ కోడ్’ భద్రత గురించి ఎటువంటి ధర్మ సందేహాలు వ్యక్తం చేయలేదు. ఎందుకంటే, అప్పుడు రప్పా రప్పాతో చాలా బిజీగా ఉన్నారు కనుక!

కానీ వైసీపీ అవినీతిని చూసిన ప్రజలు ఆ పార్టీ నేతలు చూపించే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేందుకు ఇష్టపడతారా?ఒకవేళ దానిని స్కాన్ చేస్తే తమ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు కట్ అయితే? లేదా తమ వివరాలన్నీ వైసీపీ చేతికి చిక్కితే?అయినా ఎప్పుడూ పాంప్లేట్స్ పంచిపెట్టే వైసీపీ ఈసారి క్యూఆర్ కోడ్ ఎందుకు స్కాన్ చేయమంటోంది?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

కనుక సిఎం చంద్రబాబు నాయుడు పేరు చెప్పినా ప్రజలు వైసీపీ నేతలు చూపించే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారా? అంటే అనుమానమే!