జగన్ పరామర్శ: శ్రీను, సతీష్ సంగతేంటి.?

Jagan Needs Is a Good Advisor

జగన్ పరామర్శలు, వైసీపీ రాజకీయాలు చూస్తుంటే వైసీపీ డీఎన్ఏ లో విధ్వంశం, వినాశనం దాగిఉన్నాయా అన్నంతలా సామాన్యుడిని భయపెడుతున్నాయి. నేడు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా తెనాలి పరామర్శకు వెళ్లిన జగన్ సమాజానికి ఏం సందేశమిచ్చారో వైసీపీ చెప్పగలదా.?

గంజాయి, డ్రగ్స్ బారిన పడి తనతో పాటు తన కుటుంబాన్ని, సమాజాన్ని కూడా భ్రష్టు పట్టిస్తున్న విధ్వంశకారులకు జగన్ మద్దతు ఇస్తున్నారు అంటే అది వైసీపీ దిగజారుడు రాజకీయం కాదా.? అదే గంజాయి మత్తులో మహిళల మీద జరుగుతున్న అన్యాయాలకు న్యాయమెక్కడా.? అంటూ ఒక పక్క ప్రభుత్వాన్ని దోషిని చేస్తూ ప్రశ్నిస్తున్న వైసీపీ,

ADVERTISEMENT

మరోపక్క అటువంటి గంజాయి బ్యాచ్ కు పోలీస్ అధికారులు బుద్ధి చెప్తుంటే అది అక్రమం, చట్ట విరుద్ధం, కూటమి ప్రభుత్వ అరాచకం అని ఇలా దిగజారుడు రాజకీయాలు చేయడం వైసీపీ కి సమంజసమా.? జగన్ పరామర్శకు నోచుకున్న సదరు వ్యక్తి జార్జ్ విక్టర్ పై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్స్ లో రౌడీ షీట్ ఉంది, దానికి తోడు ఈ గంజాయి మత్తులో పోలీస్ కానిస్టేబుల్ మీద దాడి చేసిన ఘటన ఉంది.

ఇటువంటి వారికి బహిరంగంగా బుద్ది చెప్పడం చట్ట బద్దంగా ధర్మం కాకపోయినా, అది సమాజానికి ఒక ధైర్యాన్ని, ఇటువంటి రౌడీ షీటర్లకు ఒక భయాన్ని కలిగిస్తుంది. అటువంటి చర్యల పై ప్రతిపక్షాలు కూడా రాజకీయాన్ని పక్కన పెట్టి ప్రభుత్వానికి మద్దతు తెలిపి రాష్ట్రంలో శాంతి భద్రతల పటిష్ఠతకు సహకరించాలి.

అలా కాకుండా జగన్ తన రాజకీయ లబ్ది కోసం, తన బల ప్రదర్శన కోసం ఇటువంటి వారికి మద్దతు పలకడంతో ఇప్పుడు జగన్ “కోడికత్తి కేసు నిందితుడు శ్రీను, గులకరాయి బాధితుడు సతీష్” అంశాలు చర్చకొచ్చాయి.

కేవలం వైసీపీ ఆడిన సానుభూతి రాజకీయాలు, జగన్ రక్తికట్టించిన రాజకీయ డ్రామాలతో ఇద్దరు అమాయకులు, రెండు కుటుంబాలు గత కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వచ్చింది.

ఇదే సానుభూతి, ఇదే దయా గుణం జగన్ కు కోడికత్తి శ్రీను మీద, గులకరాయి సతీష్ మీద ఎందుకు కలగలేదు. కనీసం కోడికత్తి కేసు నమోదయ్యి దాదాపు ఏడెనిమిదేళ్లు పూర్తి కావస్తున్నా ఇప్పటికి ఆ కేసు విచారణకు జగన్ కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు.? ఆ శ్రీను కుటుంబానికి ఈ కేసుల నుంచి ఎందుకు విముక్తి కలిగించడం లేదు.?

కేవలం జగన్ మీద ప్రేమతో, వైసీపీ మీద అభిమానంతోనే ఈ దాడికి పాల్పడ్డానంటూ శ్రీను స్టేట్మెంట్ ఇచ్చినా, ఆ కేసు ఎందుకు ముందుకు కదలడం లేదు.? తప్పు చేసిన వాడికి అండగా ఉంటూ వారికి తన పార్టీ నుండి మద్దతు తెలుపుతున్న జగన్ కోడికత్తి శ్రీను వ్యవహారంలో ఎందుకు అడుగు ముందుకు వేయడం లేదు.

అలాగే గత ఎన్నికల ప్రచారంలో జగన్ లేవనెత్తిన గులకరాయి దాడి కేసులో అరెస్టయిన వ్యక్తి ఒక వడ్డెర కులస్తుడు, అతనికి చేయి కూడా సరిగా పనిచేయదు అని తల్లి తండ్రులు ఆధారాలు కూడా చూపించారు. అటువంటి వ్యక్తిని కేవలం వైసీపీ తమ రాజకీయ అవసరాల కోసం, జగన్ ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసం అరెస్టు చేసి కేసులు పెట్టి వేధించారు అంటూ మాజీ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

అలాగే తన పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంలో సుబ్రహ్మణ్యం అనే దళిత కుటుంబం తమకు జరిగిన అన్యాయానికి న్యాయం కావాలంటూ ఏళ్ళ పాటు పోరాడుతున్నా జగన్ కనీసం సదరు అనంతబాబుని తన పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయలేకపోయారు. ఇటువంటి వ్యక్తుల పట్ల, అటువంటి నిస్సహాయ కుటుంబాల మీద జగన్ కు లేని ప్రేమ, దయ ఇటువంటి గంజాయి వ్యసనం ఉన్న వ్యక్తుల పైనా.?

ADVERTISEMENT
Latest Stories