పరిశ్రమల స్థాపనకు కేవలం ప్రోత్సాహకాలు ఇస్తే సరిపోదు. అందుకు అనుకూలమైన రాజకీయ వాతావరణం కూడా ఉందనే నమ్మకం కలగాలి.
మూడేళ్ళ క్రితం విశాఖలో రెండు రోజులపాటు జరిగిన సదస్సుకు హాజరైన పారిశ్రామికవేత్తలు కేవలం ‘జగన్ ఇమేజ్’ చూసి రాష్ట్రంలో 13.50 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేశారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గొప్పగా చెప్పుకున్నారు.కానీ రాష్ట్రంలో అవి ఎక్కడున్నాయో ఎవరికీ తెలీదు.
వాస్తవానికి ‘జగన్ ఇమేజ్’ చూసే అందరూ భయపడి పారిపోయేవారు. ఐదేళ్ళ తర్వాత మళ్ళీ నేనే ఏపీకి ముఖ్యమంత్రిని అవుతానని జగన్ పదేపదే చెపుతున్నారు. కనుక జగన్‌ని చూసి పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు నేటికీ భయపడుతున్నారంటే అతిశయోక్తి కాదు.
ఈ నేపధ్యంలో వారికి నమ్మకం కలిగించి ఏపీకి పెట్టుబడులు, పరిశ్రమలు రప్పించడం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పెద్ద సవాలే అని చెప్పవచ్చు.
జగన్ 5 ఏళ్ళ పాలనలో సాధించలేకపోయిన పరిశ్రమలు, పెట్టుబడులను చంద్రబాబు సిఎం నాయుడు కేవలం 5 నెలల్లోనే సాధించి చూపుతున్నారు.
ఆయన ముఖ్యమంత్రి కాగానే ఒక దాని తర్వాత ఒకటి క్యూ కట్టిన్నట్లు పరిశ్రమలు రాష్ట్రానికి తరలివస్తున్నాయి. సిఎం చంద్రబాబు నాయుడుకి ఉన్న ఇమేజ్ ఇందుకు ప్రధాన కారణమని వేరే చెప్పక్కరలేదు.
సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న సచివాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబి) తొలి సమావేశం జరిగింది. దానిలో ఒకేసారి 10 భారీ పరిశ్రమలకు ఆమోదం తెలిపారు. ఆ వివరాలు క్లుప్తంగా….





