గెలిస్తే క్రెడిట్ చోరీ….ఓడితే వార్నింగ్.?

Jagan addresses YCP leaders on local polls

ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల సమరానికి ఇప్పటి నుంచే అధికార ప్రతిపక్షాలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. అందులో భాగంగానే నేడు తాడేపల్లిలో పార్టీ నియోజకవర్గాల ఇంచార్జ్ లతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు.

రానున్న స్థానిక ఎన్నికల యుద్ధంలో వైసీపీ పార్టీ క్యాడర్, లీడర్ లు అందరు పార్టీ గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేయాలనీ, ఎక్కడ ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకూడదని, అలా జరిగిన నియోజకార్గాల పార్టీ ఇంచార్జ్ లకు వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే సీటు ఉండదంటూ క్లియర్ అల్టిమేటం జారీ చేసారు జగన్.

ADVERTISEMENT

అలాగే తమ తమ నియోజకవర్గాలలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో పార్టీ ఇంచార్జ్ లు పూర్తి బాధ్యత తీసుకుని పారీ క్యాడర్ కి అండగా ఉండాలని, దానికి సంబంధించి పూర్తి రిపోర్ట్ తీసుకుంటా అంటూ పార్టీ ఎమ్మెల్యే కాండిడేట్లకు జగన్ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారనే చెప్పాలి.

జగన్ ఇంత స్పష్టంగా, ఖచ్చితంగా ఏకగ్రీవాలకు తావుండకూడదు అంటూ హెచ్చరించడం వెనుక జగన్ ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుందో అర్ధమవుతుంది. కూటమి ప్రభుత్వం పై ప్రజలలో తీవ్ర అసంతృప్తి, డీఎస్సీ లో లోకేష్ అక్రమాలకు పాల్పడ్డాడు అంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్న ఈ తరుణంలో ఇప్పుడు వైసీపీ గెలుపు అనివార్యమని జగన్ భావిస్తున్నారు.

ఈ గెలుపుతో జగన్ 2.0 ఆశలను వైసీపీ శ్రేణులకు సజీవంగా ఉంచాలనే భావనలో జగన్ ఉన్నారు. మరి జగన్ ఆదేశాలను అనుసరిస్తూ తమ నియోజకవర్గాల గెలుపు కోసం ఎంతమంది వైసీపీ ఇంచార్జ్ లు కూటమి తో రాజకీయ యుద్ధం చేసి తమ ఎమ్మెల్యే సీటుకు ఎసరు పడకుండా చూసుకుంటారు అనేది రానున్న రోజులలో తేలనుంది.

అయితే ఎన్నికలలో జగన్ ఆశించినట్టుగా పార్టీ ఇంచార్జ్ లు పని చేసి పార్టీ కి అనుకూల ఫలితాలు సాధిస్తే ఆ గెలుపు క్రెడిట్ మొత్తం తీసుకోవడానికి ఏ మాత్రం ఆలోచించని జగన్ ఒక వేళా ఫలితాలు కూటమికి అనుకూలంగా వస్తే మాత్రం ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందంటూ అధికార పార్టీ నేతలను, అధికారులను నిందిస్తూ అందుకు సొంత పార్టీ ఇంచార్జ్ ని బలిచేయనున్నారన్నమాట.

అలాగే ఇటు అధికార కూటమి కూడా ఈ మధ్య కాలంలో తరచుగా బయటకొస్తున్న పొత్తుల అంతర్గత కుమ్ములాటలను అధిగమనించి వైసీపీ ని కట్టడి చేసి రాష్ట్రంలో ఇప్పటికి తమదే హావ అని స్థానిక ఎన్నికలలోను 2024 ఫలితాలను రిపీట్ చెయ్యగలదా.?

ADVERTISEMENT
Latest Stories