
వైసీపీ అధినేత వైస్ జగన్ మెహన్ రెడ్డి కి కేసులంటే క్యార్బరి చాక్లెట్ మాదిరి తియ్యగా ఉంటాయో ఏమో కానీ ఏడాదికో కేసు నెత్తినేసుకుని కేసులతో గిన్నిస్ బుక్ సృష్టించాలని కంకణం కట్టుకున్నట్టు వ్యవహరిస్తున్నారు.
Also Read – సైకో రాజకీయాలు చేయవద్దని చెప్పా: పేర్ని నాని
ఇప్పటికే తన తండ్రి వైఎస్ఆర్ హయాంలో జరిగిన అక్రమాలకు, అవినీతి కాను 32 కేసులను వెనకేసుకున్న జగన్, వాటికీ తోడు తన హయాంలో కోడికత్తి కేసు, గులకరాయి కేసు భుజానికెత్తుకున్నారు.
అలాగే గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అనేక అవకతవకలలో కూడా జగన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కాం కేసులో జరిగిన వేల కోట్ల అవినీతి కి తాడేపల్లి ప్యాలస్ అడ్డాగా నిలిచింది అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read – కోటా శ్రీనివాసరావు ఇక లేరు
ఇవి కాకుండా తండ్రి వైస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తుల పంపకాల విషయంలో తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల మీద జగన్ వేసిన కేసులు అందుకు ప్రతిగా తల్లి, చెల్లి నుండి జగన్ ఎదుర్కున్న కేసులు ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా జగన్ కుటుంబ వివాదాల ఫలితంగా వ్యక్తిగతంగా జగన్ మోస్తున్న కేసులు.
నిండా మునిగినోడికి చలేంటి అన్న చందంగా జగన్ కేసులకు భయపడేదే లేదు అన్నటుగా తనతో పాటుగా తన పార్టీ క్యాడర్ ను కూడా రెచ్చకొడుతూ ఆ దిశగా తన పార్టీ శ్రేణులు తప్పటడుగులు వేయిస్తూ దూకుడుగా ముందుకెళ్తున్నారు.
Also Read – గుడివాడ ఫ్లెక్సీ వివాదం..
ఇక ఇప్పుడు తాజాగా జగన్ పొదిలి ఘటన, సత్తెనపల్లి పర్యటనలో భాగంగా జరిగిన సింగయ్య అనే వ్యక్తి మృతి పట్ల జగన్ పై మరో రెండు కేసులు నమోదయ్యింది. అయితే ఇలా జగన్ పై కేసుల సంఖ్య అయితే పెరుగుతుంది కానీ ఆ కేసుల విచారణ మాత్రం అడుగు కూడా ముందుకు సాగడం లేదు.
అప్పుడెప్పుడో పుష్కర కాలానికి దగ్గర వచ్చిన జగన్ అక్రమాస్తుల కేసు ఇప్పటికి విచారణలతో, వాయిదాలతో తెలుగు టెలివిజన్ సీరియల్ మాదిరి నిర్వీరంగా కొనసాగుతూనే ఉంది. అయితే కనీసం కేసుల విచారణకు సైతం జగన్ హాజరు కాకపోవడం ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విచిత్రం.
జగన్ కోడికత్తి కేసులో ఇప్పటికి బాధితులు ఎవరో, నిందితులు ఎవరో అర్ధం కానీ పరిస్థితి. ఇక తల్లి, చెల్లి వేసిన కేసులలో ఎవరిదీ న్యాయపోరాటం, ఎవరిదీ అత్యాశ ఆరాటం అన్నది తేలలేదు. లక్ష కోట్ల అవినీతి అంటూ పెద్ద గీతతో మొదలుపెట్టిన జగన్ కేసులు చివరికి రోజులు గడిచే కొద్దీ చిన్న గీతలుగా మారిపోతున్నాయి.
ఈడీ, సిబిఐ, సిఐడి, సిట్…ఇలా అనేకరకాల దర్యాప్తు బృందాల నుంచి కేసులు ఎదుర్కొటున్న వైస్ జగన్ దాదాపు 11 ఏళ్ళ నుంచి బైలు మీద ఉండి పార్టీని నడిపిస్తున్నాడు, ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నారు. అటువంటి జగన్ కు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెట్టే ఒకటి రెండు కేసులు పెద్ద లెక్కలోకి వస్తాయా.?
సింగయ్య మృతి కానీ, పొదిలి దుర్ఘటన కానీ జగన్ కు ఉన్న శత కోటి కేసులలో మరో కేసుగా మిగిలిపోతాయా.? లేక ఈ కేసులో అయినా చట్టం అందరికి సమానమే అన్న వాదన వాస్తవ రూపంలోకి వస్తుందా.? అయితే సింగయ్య మృతి పట్ల తన పై నమోదయిన కేసును క్యాష్ చెయ్యాలంటూ జగన్ న్యాయస్థానాలను ఆశ్రయించగా కోర్ట్ వచ్చే మంగళవారానికి విచారణను వాయిదా వేసింది.