గుడ్ మార్నింగ్ సిఎం సర్!

janasena good morning cm sir programఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజూ గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌, వారి పార్టీ నేతలు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డికి రోజూ గుడ్ మార్నింగ్ చెప్పాలనుకోవడమే విశేషం.

అందుకు బలమైన కారనమెఉన్ది. పవన్‌ కళ్యాణ్‌ వీకెండ్ రాజకీయ నాయకుడని, వారానికొకసారి షూటింగ్ విరామంలో రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు నాయుడు వ్రాసిచ్చిన స్క్రిప్ట్ చదివివెళ్ళిపోతుంటారని, ప్రజా సమస్యలపై ఆయనకు అవగాహన లేదంటూ ఇటీవల ఓ వైసీపీ నేత చాలా సెటైర్లు వేశారు. సిఎం జగన్ కూడా పవన్‌ కళ్యాణ్‌పై సెటైర్లు వేస్తూ చంద్రబాబు నాయుడు చాటున దాక్కోవడం కాదని దమ్ముంటే నేరుగా వచ్చి ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.

ADVERTISEMENT

వైసీపీ విసురుతున్న ఈ సెటైర్లు, సవాళ్ళపై జనసేన పార్టీ కూడా అదే స్థాయిలో జవాబిచ్చింది. ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఈరోజు ట్విట్టర్‌లో ఓ వీడియో సందేశంలో మాట్లాడుతూ, “ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి సవాలును మేము స్వీకరిస్తున్నాము. పవన్‌ కళ్యాణ్‌గారు ఈరోజు ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15,16,17 తేదీలలో #గుడ్ మార్నింగ్ సిఎం సర్ పేరుతో ఓ డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టాలని నిర్ణయించారు. ఎందుకంటే గాఢనిద్రలో ఉన్న సిఎం జగన్మోహన్ రెడ్డిగారు కలలుకంటూ తన పాలనలో రాష్ట్రం చాలా అద్భుతంగా ఉందని భ్రమలో ఉంటున్నారు.

కనుక మా జనసేన నేతలు, కార్యకర్తలు రాష్ట్రంలో రోడ్ల వాస్తవ పరిస్థితిని సిఎంగారికి అర్థమయ్యేలా తెలియజేసేందుకు, చక్కటి ఫోటోలు, వీడియోలతో ఈ మూడు రోజుల పాటు డిజిటల్ క్యాంపెయిన్ చేస్తారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఏవిధంగా ఉన్నాయనే విషయం ఆన్‌లైన్‌ క్యాంపెయినింగ్ ద్వారా సిఎం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళతాము. పవన్‌ కళ్యాణ్‌గారు కూడా మొదటిరోజు నుంచే ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన కూడా ఫోటోలు, వీడియోలు పెడతారు,” అని చెప్పారు.

ఇదివరకు పొరుగు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేసినప్పుడే జగన్ సర్కార్ మేలుకొని రోడ్లు మరమత్తుల పనులు మొదలుపెట్టింది. కానీ నేటికీ ఆ పనులు పూర్తవకపోగా వర్షాల కారణంగా ఇంకా అనేక రోడ్లు దెబ్బతిన్నాయి. గుంటూరులో ఒక ప్రధాన రహదారిపై గుంతలు పడి గొలుసుకట్టు చెరువులుగా మారితేనే మీడియా, సోషల్ మీడియాలో గోలగోలైపోయింది. ఇప్పుడు జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల దుస్థితిని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చేసినట్లయితే జగన్ ప్రభుత్వం పరువు గంగలో కలిసిపోతుంది.

కనుక జనసేన ఆ పని మొదలుపెట్టేలోగా రాష్ట్రంలో రోడ్లన్నీ యుద్ధప్రాతిపదికన మరమత్తులు చేయాలనీ ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి అధికారులకు హుకుం జారీ చేశారు. జనసేన దాడిని ఎదుర్కోవడానికిగాను రోడ్లకు నాడు-నేడు ఫోటోలు కూడా తీసి సిద్దంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

అయితే రాష్ట్ర వ్యాప్తంగా వేల కిలోమీటర్ల మేర పాడైపోయిన రోడ్లను రాత్రికి రాత్రి మరమత్తులు చేయాలంటే ఆలీబాబా అద్భుత దీపమైనా ఉండాలి లేదా పాతాళభైరవి బొమ్మైనా ఉండాలని అధికారులు చెవులు కోరుక్కొంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories