దీన్ని పార్టీతో ముడిపెట్టొద్దు: అరవ శ్రీధర్

Arava Sridhar Controversy

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్-వీణల వ్యవహారంపై జరిగింది… ఇంకా జరుగుతున్నదీ అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రజలు కూడా (ఎవరి పార్టీలని బట్టి వారు) తీర్పులు చెప్పేశారు. కనుక ఈ కేసులో కొత్తగా తీర్పు చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ వ్యవహారాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ కూడా గంభీరంగానే తీసుకున్నారు. అందుకే వెంటనే ముగ్గురు సభ్యులతో క్రమశిక్షణ కమిటీ వేశారు. అరవ శ్రీధర్‌ నేడు కమిటీ ముందు హాజరయ్యి వివరణ ఇచ్చుకున్నారు. ఆయన వారికి చెప్పాల్సింది చెప్పుకున్నారు. కనుక క్రమశిక్షణ కమిటీ ఈ విషయాన్ని తమ అధినేతకు తెలియజేస్తారు. అయన ఏం నిర్ణయం తీసుకుంటారో త్వరలో తెలుస్తుంది.

ADVERTISEMENT

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కమిటీ ముందు సంజాయిషీ ఇచ్చుకొని బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “ఈ వ్యవహారం నాకు- ఆ అమ్మాయికి మద్య జరిగింది. దీంతో జనసేన పార్టీకి ఎటువంటి సంబంధమూ లేదు. కనుక దయచేసి దీనిని జనసేనతో ముడిపెట్టవద్దు,” అని విజ్ఞప్తి చేశారు.

ADVERTISEMENT
Latest Stories