ట్రైలర్ టాక్ – మీ పనే నా మనీ!

Jayammu Nischayammura Teaser Talkకమెడియన్ శ్రీనివాసరెడ్డి, పూర్ణ జంటగా నటించిన “జయమ్ము నిశ్చయమ్మురా” సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపధ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అందులో భాగంగా తాజాగా ఒక నిముషం నిడివి గల కామెడీ సన్నివేశంతో కూడిన ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘తత్కాల్’ అనే పేరుతో కమెడియన్ ప్రవీణ్ చేసిన ఈ సన్నివేశం ఉభయ గోదావరి జిల్లాల డైలాగ్ లను కళ్ళకు కట్టినట్లు చూపించింది.

ADVERTISEMENT

‘మీ పనే నా మనీ’ అని బోర్డు పెట్టుకుని ప్రభుత్వ పనులను సమకూర్చడంలో సిద్ధహస్తుడుగా ప్రవీణ్ చమత్కారం ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచింది. లో బడ్జెట్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రవీణ్ లాంటి తారాగణమే ప్లస్ పాయింట్స్ గా నిలుస్తున్నాయి. కనుమూరి శివరాజ్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో సిద్ధమైన ఈ సినిమాను మార్కెట్ లోకి ఈ నవంబర్ లోనే విడుదల చేయబోతున్నట్లుగా ఈ ట్రైలర్ లో స్పష్టం చేసారు.

ADVERTISEMENT
Latest Stories