చంద్రబాబుపై జేసీ ఎఫెక్ట్ బానే పని చేసిందిగా

Chandrababu Naidu - JC - Diwakar Reddyమహానాడు సాక్షిగా నేతలందరూ చంద్రబాబుపై పొగడ్తలు కురిపిస్తే ఒక్క అనంతపూర్ ఎంపీ జేసీ దివాకరరెడ్డి మాత్రం చంద్రబాబును పొగుడుతూనే కొన్ని చురకులు కూడా అంటించారు. అధికారులను గంటల తరబడి కాంఫరెన్సుల పేరిట కూర్చొబెట్టొదని వారిని వారి పని చేసుకోనివ్వాలని, అదే సమయంలో జన్మభూమి కమిటీలను కట్టడి చెయ్యాలని ఆయన సూచించారు.

దీనిపై చంద్రబాబు వేగంగానే స్పందించారు. స్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారుల ఎంపికలో జన్మభూమి కమిటీల ప్రమేయాన్ని తొలగిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇకపై జన్మభూమి కమిటీలను అడ్వైజరీ కమిటీలుగా మాత్రమే పరిగణించాలన్నారు. అర్హులైన లబ్ధిదారులను శాఖలు, కార్పొరేషన్ల ద్వారానే ఎంపిక చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

ADVERTISEMENT

అలాగే ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్లు ఎప్పుడుబడితే అప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టొద్దని… వారానికి ఒక్కసారి మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ రెండు నిర్ణయాలు మహానాడు అయినవెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్నారు. చంద్రబాబుపై జేసీ ఎఫెక్ట్ బానే పని చేసిందిగా

ADVERTISEMENT
Latest Stories