ఆశించిన ప్రకటన వచ్చింది… సరికొత్త రికార్డులు సృష్టిస్తుందేమో..!

jio-new-offers-for-new-year-till-marchటెలికాం రంగంలో సంచలనంగా నిలిచిన రిలయన్స్ జియో నుండి ఆశించిన విధంగానే ‘ఉచిత ఆఫర్’ పెంపు ప్రకటన వచ్చింది. 2017 మార్చి వరకు “ఆల్ ఫ్రీ” ఆఫర్ ను పొడిగిస్తున్నట్లుగా సంస్థ అధినేత ముఖేష్ అంబానీ నుండి అధికారిక ప్రకటన విచ్చేయడంతో… ఇతర కంపెనీల షేర్లు కుదేలయ్యి, ఏకంగా 3000 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. రికార్డు స్థాయిలో 5 కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకున్న రిలయన్స్ సంస్థ ప్రకటన చూస్తుంటే… తదుపరి మూడు నెలల్లో 10 కోట్ల మార్క్ ను అందుకోవాలన్న లక్ష్యం కనపడుతోంది.

అదే జరిగితే అతి తక్కువ సమయంలో అంత మంది కస్టమర్లను సొంతం చేసుకున్న సంస్థగా చరిత్ర పుటల్లోకి ఎక్కడం ఖాయం. బహుశా ఈ టార్గెట్ ను దృష్టిలో పెట్టుకునే ఏమో గానీ, మొబైల్ నెంబర్ పోర్టబులిటీని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. గతంలో 90 శాతంగా ఉన్న కాల్ డ్రాప్స్ ను, ప్రస్తుతానికి 20 శాతానికి తీసుకువచ్చామని చెప్పడం వెనుక ఉద్దేశం ఇదేనని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరో నాలుగు నెలల పాటు ఉచిత ఆఫర్ ప్రకటన ప్రభావం ఖచ్చితంగా ప్రజలపై పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories