నాకు మా ఆవిడ కూడా చివాట్లు పెట్టింది: జోగి రమేష్

jogi-ramesh Comments on the mistakes done by YSRCP Leaders

జగన్‌ 5 ఏళ్ళ పాలనలో చేసిన తప్పులు, అరాచకాలు, అవినీతికి లెక్కే లేదు. వాటన్నిటి కారణంగానే ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓడిపోతే, ఈవీఎంల వలన ఓడిపోయామని ఓసారి, చంద్రబాబు నాయుడు మాయమాటలు నమ్మి ప్రజలు ఓడించారని మరోసారి, ఇలా ప్రతీసారి ఏదో ఓ కారణం చెప్పుకుంటూనే ఉన్నారు.

అయితే వైసీపీని వీడినవారు, ఇంకా పార్టీని అంటిపెట్టుకున్నవారు మాత్రం ఏదో సందర్భంలో తాము చేసిన తప్పులను తమ నోటితోనే చెప్పుకుని వాటి కారణంగానే వైసీపీ ఒడిపోయిందని ఒప్పుకుంటున్నారు.

ADVERTISEMENT

మాజీ మంత్రి జోగి రమేష్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, “ఆనాడు శాసనసభలో నాతో సహా వైసీపీలో కొంత మంది సభ్యులు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిగారిని ఉద్దేశించి చాలా తప్పుగా మాట్లాడాము. మా ఇంట్లో వాళ్ళు, నా భార్య సైతం మా తీరుని తప్పు పట్టింది. శాసనసభకు వెళ్ళి మాట్లాడే మాటలు ఇవేనా?మరొకరి ఇంట్లో ఆడవాళ్ళ గురించి అలా తప్పుగా మాట్లాడవచ్చా? అంటూ చివాట్లు పెట్టింది. అప్పుడే నాకూ తప్పు చేశామనిపించింది. శాసనసభలో నేను, వైసీపీ ఎమ్మెల్యేలు ఆమె గురించి మాట్లాడిన మాటలు చాలా తప్పే. ఇటువంటి తప్పులే మా పార్టీ ఓటమికి కారణం అయ్యుండవచ్చు. తప్పు చేసిన తర్వాత ఒప్పుకునే ధైర్యం కూడా ఉండాలి. నేను ఒప్పుకుంటున్నాను,” అని అన్నారు.

అయితే చేయకూడని తప్పులన్నీ చేసి ఇప్పుడు చేతులు కాలక ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం?అంటే చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసు నుంచి తనకు విముక్తి ప్రసాదిస్తారనే చిన్న ఆశ కావచ్చు. కానీ కేసుల నుంచి బయటపడటం ఇంత సులువైతే, దేశంలో జైళ్ళలో మగ్గుతున్న లక్షాలది మంది ఖైదీలందరూ కూడా క్షమాపణ చెప్పుకొని విడుదలైపోవచ్చు.

ఏది ఏమైనప్పటికీ వైసీపీ ఓటమికి స్వయంకృతాపరాధాలే కారణమని మెల్లగా జోగు రమేష్ ఒప్పేసుకున్నందుకు చాలా సంతోషం.

ADVERTISEMENT
Latest Stories