వైసీపీ లో అందగాళ్ళను కూటమి ప్రభుత్వం కుట్ర పూరితంగా అరెస్టు చేస్తుందంటూ వైసీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పార్టీలో ఇప్పటి వరకు అనేకమంది అందగాళ్ళు, సౌమ్యులు అరెస్టయ్యి జైలుకెళ్లారు అలాగే బైలు మీద బయటకొచ్చారు.
ఇప్పటికే ఈ జాబితాలో నందిగామ సురేష్, పోసాని కృష్ణ మురళి, వర్రా రవీంద్ర, వల్లభనేని వంశీ, బోరుగడ్డ అనిల్ కుమార్, మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి…ఇలా చెప్పుకుంటూ పొతే…ఈ లిస్ట్ రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టో మాదిరి పెరుగుతూనే ఉంటుంది.
అయితే ఇప్పుడు తాజాగా వైసీపీ నుంచి మరో అందగాడు, సౌమ్యుడు మాజీ మంత్రి జోగి రమేష్ కూడా నకిలీ మద్యం కేసులో అరెస్టయ్యి జైలుకెళ్లారు. దీనితో వైసీపీ రాజకీయ పార్టీ ఒకఅందగాళ్ళ పార్టీగా రూపాంతరం చెందుతుంది అనే భావన ఏపీ రాజకీయాలలో బలంగా వినిపిస్తుంది.
మరి ఈ అందమైన వైసీపీ కుటుంబానికి సౌమ్యమైన దారులు కూడా రెండే అన్నట్టుగా వ్యవహారం నడుస్తుంది. అయితే జైలు లేదా బైలు అన్నట్టుగా వైసీపీ అందగాళ్ళ రాజకీయ కదలికలు కనిపిస్తున్నాయి. గత ఐదేళ్ల పాపానికి తోడు ఈ ఏడాది దోషాలతో కలిపి జోగి నకిలీ మద్యం కేసులో ఎట్టకేలకు అరెస్టయ్యారు.
అయితే జోగి సత్య ప్రమాణాలు, తొడగొట్టిన సవాళ్లు ఏమి కూడా ఆయన అరెస్టును ఆపలేకపోయాయి, మరియు ఆయన్ను జైలుకెళ్ళకుండా అడ్డు కోలేకపోయాయి. ఇప్పటికే జోగి జైలు అనే ఒక సౌమ్యమైన దారిలో అడుగు పెట్టారు కాబట్టి ఇక ఆ తరువాత బైలు అనే మరో సౌమ్యమైన దారిలోనే బయటకు రావాల్సి ఉంటుంది.
వల్లభనేని వంశీ వంటి వైసీపీ అందగాడు సైతం ఈ రెండు సౌమ్యమైన దారులలోనే వెళ్లారు, వచ్చారు. ఇక ఇప్పుడు జోగి వంతు. అయితే ఈ దారిలోకి రావాల్సిన మరికొనటండి వైసీపీ అందగాళ్ళు ఇంకా ఆ స్థానాన్ని చేరుకోలేకపోయారు.






