మాటల్లేవ్… శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలే!

Kakinada to Host India’s Largest Green Ammonia Plant

సంక్షేమ పధకాల డప్పు లేదు… బూతులు లేవు… నా అక్కలు, చెల్లెమ్మలు, అవ్వా తాతాలంటూ పోసికోలు కబుర్లు లేవు… నా బీసీలు..నా ఎస్సీలు..నా ఎస్టీలు… అంటూ ఖూని రాగాలు అసలే లేవు. కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు, డీఎస్సీ, ఉద్యోగాల భర్తీ, అమరావతి, పోలవరం, భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులు… వీటి గురించే ఎక్కువగా వినబడుతున్నాయి.

దేశంలోకెల్లా అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ కాకినాడలో ఏర్పాటు కాబోతోంది. దీనికి సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ కలిసి నేడు శంకుస్థాపన చేశారు.

ADVERTISEMENT

రూ.18,000 కోట్ల పెట్టుబడితో కాకినాడలో 495 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత ప్లాంటు ఏర్పాటవుతోంది. దీనిలో తయారయ్యే గ్రీన్ అమ్మోనియాని 100 శాతం జర్మనీ, జపాన్, సింగపూర్ దేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా 8,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి లభించనున్నాయి. ప్లాంట్ ఉత్పత్తి మొదలైతే రవాణా, స్టోరేజ్, పోర్టులో ఎగుమతుల ద్వారా మరికొన్ని వేలమందికి ఉపాధి లభిస్తుంది.

మలేషియా, సింగపూర్, యూఏఈలకు చెందినా మూడు ప్రముఖ సంస్థల సహకారంతో కాకినాడలో ఈ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ కాకినాడలో ఏర్పాటు కాబోతోంది. దీనిలో ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా, 1,950 మెగావాట్ల ఎలక్ట్రోలీజర్ ఉత్పత్తి అవుతుంది.

రాబోయే 10 సంవత్సరాలలో దీని ఉత్పత్తి నాలుగైదు రెట్లు పెరుగుతుంది. ఆ నిష్పత్తిలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.

ADVERTISEMENT
Latest Stories