కల్వకుంట్ల కవితని కూడా బరిలో దించారే!

Kalvakuntla Kavitha Adani case

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దాదాపు ఆరు నెలలు తిహార్ జైల్లో ఉండి ఆగస్ట్ 27న బెయిల్ పై విడుదలై ఇంటికి తిరిగి వచ్చారు.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సోదరి కనిమోళి కూడా ఇటువంటి మరో కేసులో అరెస్ట్ అయ్యి , కొన్ని నెలలు తిహార్ జైల్లో గడిపి బయటపడ్డారు. అప్పటి నుంచి రాజకీయాలకు, పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉండిపోయారు. కనుక కల్వకుంట్ల కవిత కూడా ఆదేవిదంగా రాజకీయాల నుంచి తప్పు కుంటారని చాలా మంది భావించారు.

ADVERTISEMENT

కానీ అదానీ కేసుపై ట్విట్టర్‌లో స్పందిస్తూ “అదానీకో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా మోడీజీ?” అని ట్వీట్ చేశారు. తాజాగా అదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్ధులు మరణిస్తున్నారని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ తీవ్ర విమర్శలు చేశారు.

అంటే కల్వకుంట్ల కవిత మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ అయిన్నట్లే భావించవచ్చు. ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఒడిపోయినప్పటి నుంచి కేసీర్‌ ఫామ్ హౌసులోనే ఉంటూ కొడుకు కేటీర్‌, మేనల్లుడు హరీష్ రావుల చేత పార్టీని నడిపిస్తున్నారు. ఇప్పుడు వారితో పాటు కల్వకుంట్ల కవితని కూడా బరిలో దింపిన్నట్లు భావించవచ్చు.

ఇదివరకు జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించినప్పుడు టీడీపీ పరిస్థితి అయోమయంగా మారింది. కానీ సీనియర్ నేతలందరూ వెంటనే తెరుకొని రంగంలో దిగి టీడీపీ శ్రేణులకు అండగా నిలిచి ధైర్యంగా జగన్ ప్రభుత్వంతో పోరాడారు.

ఆ పరిణామాలను కేసీర్‌ కూడా నిషితంగానే గమించారు. కనుక తాను లేనప్పుడు కూడా బిఆర్ఎస్ పార్టీ అంతే ధృడంగా నిలబడి పోరాడేలా తయారు చేసుకుంటున్నట్లున్నారు. అందుకే కాంగ్రెస్ నేతలు ఎంతగా విమర్శిస్తున్నా కేసీర్‌ ఫామ్ హౌసులో నుంచి బయటకు రాకుండా కొడుకు, మేనల్లుడు, ఇప్పుడు కూతురు కల్వకుంట్ల కవిత ద్వారా పార్టీని నడిపించే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు. ప్రాంతీయ పార్టీల మనుగడకి ఇటువంటి ముందుచూపు, శిక్షణ చాలా అవసరమే.

ADVERTISEMENT
Latest Stories