ఎట్టకేలకు నిశ్శబ్దాన్ని ఛేదించారు…!

Kalvakuntla Kavitha

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నుండి బెయిలు మీద బయటకు వచ్చిన కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తండ్రి బాటలోనే రాజకీయ వేదికలకు, రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆమె దాదాపు మూడు నెలల తరువాత ఎట్టకేలకు తన రాజకీయ మౌనాన్ని వీడి బీజేపీ మౌనం మీద తన సోషల్ మీడియాలో ప్రశ్నించారు.

అమెరికాలో అదానీ మీద నమోదైన కేసు విషయమై బీజేపీని ఉద్దేశించి కవిత చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. “అఖండ భారతంలో అదానికో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా.?” ఆధారాలు లేకుండా ఒక ఆడబిడ్డను అరెస్టు చేసి విచారణ పేరుతో ఆరు నెలలు జైలులో ఉంచగలిగిన బీజేపీ ప్రభుత్వం ఆధారాలతో అడ్డంగా దొరికిన అదానీని అరెస్టు చేయడానికి మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు.

ADVERTISEMENT

అదానీ మీద ఇటువంటి ఆరోపణలు పదేపదే వస్తున్నప్పటికీ ప్రధాని మాత్రం అదానీ వైపేనా.? అలాగే ఇటువంటి బడా వ్యాపారస్తుల పై వస్తున్న ఆరోపణలు మీద, విదేశాలలో సైతం నమోదవుతున్న కేసుల మీద బీజేపీ ఎప్పుడు మౌనాన్నే ఆశ్రయిస్తుందా.? అంటూ కవిత తన రాజకీయ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ బీజేపీ మీద ఘాటైన విమర్శలు గుప్పించారు.

అయితే ఇటు అదానీ కేసు విషయమై దేశీయ మార్కెట్లు సైతం స్పందిస్తూ ఎరుపెక్కాయి ..కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ పెద్దలు కానీ ఎటువంటి ప్రకటన ఇవ్వకపోవడం ఇటువంటి వారి ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.

అటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఈ విషయం మీద స్పందిస్తూ అదానీ విషయంలో బీజేపీ ప్రభుత్వ మౌనాన్ని తప్పుబడుతూ కేంద్ర పెద్దల నిస్సహాయతను ప్రశ్నించారు. అదానీ ఇష్యూ మహారాష్ట్ర ఎన్నికలకు ముందు భయటకు వస్తే అప్పుడు బీజేపీ ఆత్మ రక్షణలో పడేదని, ఇది ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాలను నిర్దేశించే ఒక అంశంగా, ప్రతిపక్ష కాంగ్రెస్ కు ఒక అస్త్రంగా మారేదనే వాదన సర్వత్రా వినిపిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories