కల్వకుంట్ల కవిత సీన్ రిక్రియేషన్ చేస్తున్నారా?

Kalvakuntla Kavitha speaking about TRS revival and Telangana political strategy

పోలీసులు ఒక నేరం జరిగిన తీరుని, దాని స్వభావాన్ని అర్థం చేసుకొని, నేరస్తులను సాక్ష్యాధారాలతో సహా కోర్టులో దోషులుగా నిరూపించేందుకు ‘క్రైమ్‌ సీన్ రిక్రియేషన్’ చేస్తుంటారు.

తెలంగాణలో టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ప్రస్తుతం అదేవిధంగా ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు.

ADVERTISEMENT

ముందుగా హరీష్‌ రావుని తర్వాత అన్నని, తర్వాత తండ్రిని నిందించి విమర్శించడం ప్రారంభించారు. తద్వారా వారు ముగ్గురినీ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు.

అలాగే బీఆర్ఎస్‌ పార్టీ పునాదుల వరకు వెళ్ళి ‘టీఆర్ఎస్‌’ని హ్యాండోవర్ చేసుకున్నారు. ఇక సీన్ రిక్రియేషన్‌లో భాగంగా పాంచజన్యం పూరించి ‘నేను ముఖ్యమంత్రినైతే…’ అంటూ కేజీ టూ పీజీ ఉచిత విద్య, అందరికీ ఉచిత వైద్యం వంటి హామీలు గుప్పిస్తూ ‘ముందుంది (బంగారి)సామాజిక తెలంగాణ’ అని ఊరిస్తున్నారు.

సీన్ రిక్రియేషన్‌లో భాగంగా నాడు కేసీఆర్‌ కాంగ్రెస్‌, టీడీపి ముఖ్యనేతలను, ఎమ్మెల్యేలను ‘ఒరిజినల్ టీఆర్ఎస్‌ పార్టీ’లోకి ఆకర్షించినట్లే కవిత కూడా తన ‘న్యూ ఒరిజినల్ టీఆర్ఎస్‌ పార్టీ’లోకి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

ఒకసారి వలసలు మొదలైతే పేకమేడలో పేక ముక్కల్లా బీఆర్ఎస్‌ పార్టీలో టపటపా వికెట్లు పడిపోవడం ఖాయం. కానీ ఇది అంత వీజీ పని కాదు.

తాను కేసీఆర్‌ కంటే గొప్ప నాయకురాలనని కల్వకుంట్ల కవిత ఎలాగూ చెప్పుకోలేరు. కానీ కేటీఆర్‌, హరీష్‌ రావుల కంటే గొప్పదానినని, వారికంటే చాలా ధైర్యం, పోరాట స్పూర్తి, నీతి నిజాయితీ వగైరా ఉన్నాయని ఖచ్చితంగా చెప్పుకోగలరు. చెప్పుకుంటున్నారు కూడా.

వీటన్నిటి కంటే ముందు వచ్చే ఎన్నికల వరకు టీఆర్ఎస్‌ పార్టీ గట్టిగా నిలబడగలదు. అందుకు అవసరమైన అంగబలం, అర్ధబలం రెండూ ఉన్నాయిని.. దమ్మున్న పార్టీ అని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

కనుక నెల రోజులపాటు ప్రతీ ఊర్లో టీఆర్ఎస్‌ పార్టీ జెండా గద్దెలు ఏర్పాటు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రతీచోట బీఆర్ఎస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారితో పోరాడి విజయానికి నిదర్శనంగా జెండా గద్దెపై టీఆర్ఎస్‌ పార్టీ పతాకం ఎగరేయాల్సి ఉంటుంది.

ఇది పులి బోనులో చెయ్యిపెట్టి చెవి పట్టుకునే మేలేయాలనుకోవడమే. ఈ నెల రోజుల షెడ్యూల్లో ఆమె ఈ సీన్స్ అన్నీ డూపులు లేకుండా విజయవంతంగా పూర్తి చేయగలిగితే, గద్దెలపై రెపరెపలాడే ఆ టీఆర్ఎస్‌ పార్టీ జెండాలు నాడు అశోకుడు, శ్రీకృష్ణదేవరాయలు వంటి రాజులు తమ విజయానికి గుర్తుగా వేసిన శిలా శాసనాలు వంటివే అని భావించవచ్చు.

కనుక చేయాల్సిన టాస్కులు చాలానే ఉన్నాయి. అందుకు తగినంత సమయం కూడా ఉంది. కనుక ఒకటొకటిగా చేస్తున్నారు కూడా.

నాడు తెలంగాణ వస్తే ప్రజల బతుకులు మారిపోతాయని కేసీఆర్‌ చెప్పినట్లుగానే, ఇప్పుడు తనని నమ్మి ముఖ్యమంత్రిని చేసుకుంటే ప్రజల బతుకులు మళ్ళీ మారిపోతాయని కల్వకుంట్ల కవిత చెప్పడం సీన్ రిక్రేయేషనే కదా?

ADVERTISEMENT
Latest Stories