‘కంప్యూటర్’ టాలెంట్ కు బలైన ‘బుడ్డోడు’

kareena baby fake photo viralపెరిగిన సాంకేతిక పరిజ్ఞానం, రోజు రోజుకు అప్ డేట్ అవుతోన్న సాఫ్ట్ వేర్లతో లేని ప్రపంచాన్ని కూడా కళ్ళ ముందు ఉన్నట్లుగా కనపడుతోంది. ముఖ్యంగా ఈ మాయాజాలంతో బలవుతోంది ఎవరు అంటే… హీరోయిన్లు అనే చెప్పాలి. మార్ఫింగ్ ఫోటోలతో హీరోయిన్ ముఖాలను మార్చి, పోర్న్ స్టార్ లుగా చిత్రీకరించే వైనం వలన ఎంతో మంది హీరోయిన్లు నెత్తి, నోరు కొట్టుకున్నారు. కానీ, తాజాగా ఓ హీరోయిన్ కు పుట్టిన బిడ్డను కూడా మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్ లో పెట్టడంతో అదే నిజమైన ఫోటోగా భావించాల్సి వచ్చింది.

బాలీవుడ్ దంపతులు సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్ కు మగ బిడ్డ పుట్టిన విషయం విదితమే. ముంబయిలోని బ్రీచ్ కాండి ఆసుపత్రిలో కరీనా ప్రసవించింది. ఈ సమాచారం అందిన కాసేపటికే కరీనా తన బిడ్డతో ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసాయి. అయితే తర్వాత తెలిసిన ట్విస్ట్ ఏమిటంటే… ఈ ఫోటోలు నిజం కాదని, ఫోటో షాప్ మాయాజాలమని కరీనకపూర్ అధికార ప్రతినిధి వాస్తవం బయటపెట్టారు. ఈ మేరకు ఒక ప్రకటన కూడా చేశారు. దీంతో అంతా అవాక్కయ్యారు.

ADVERTISEMENT

ఇదిలా ఉంటే ఈ బుడ్డోడుకు పెట్టిన ‘తైమూరు’ అనే పేరు కూడా పలు విమర్శలకు దారి తీసింది. ఎందుకంటే, ఆ పేరు మంగోల్ జాతి రాజు పేరని, ఈ పేరును ఎందుకు పెట్టారనేది వారి ప్రశ్న. అంతేకాకుండా, 14వ శతాబ్దంలో తైమూరు ఢిల్లీ పైకి దండెత్తి సర్వనాశనం చేశాడట. ఈ నేపథ్యంలోనే పలు విమర్శలు తలెత్తాయి. కాగా, ఎన్నికల కమిషన్ వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఈ పేరుతో దేశ వ్యాప్తంగా మొత్తం 5,500 మంది ఓటర్లు ఉన్నారు. కేవలం, పశ్చిమబెంగాల్ లోనే 3,351 మంది ఉండగా, యూపీలో 588 , మహారాష్ట్రలో 661, బీహార్ లో 558, జార్ఖండ్ లో 282 మంది ఉన్నారని, కొన్ని రాష్ట్రాల్లో ఒకట్రెండు పేర్లు ఉన్నాయని పేర్కొంది.

ADVERTISEMENT
Latest Stories