Kavitha Calls For BC Reservation

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకి ఈడీ నోటీస్ ఇస్తే యావత్ తెలంగాణ ఆడబిడ్డలకి ఇచ్చినట్లు. ఆమెకు కష్టం వస్తే అందరికీ వచ్చినట్లు. ఆమెకు మాత్రమే కాదు.. కల్వకుంట్ల కుటుంబంలో ఎవరికి నోటీస్ వచ్చినా తెలంగాణ ప్రజలందరికీ వచ్చినట్లే.. అవమానించినట్లే అని వాదిస్తుంటారు.

తండ్రి కేసీఆర్‌ పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేదు. కానీ ఆమెకు ఈడీ నోటీస్ రాగానే చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్స్ అవసరమని గుర్తుకు వచ్చి ఢిల్లీలో ధర్నా చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆ ఊసే లేదు!

Also Read – లోకేష్ -కేటీఆర్…రహస్య భేటీ.?

పార్టీపై తిరుగుబాటు చేయడంతో ఇప్పుడు మళ్ళీ ఆమెకు కష్టం వచ్చింది. కనుక తెలంగాణ ప్రజలందరికీ కష్టం వచ్చినట్లే! కనుక ఆమె తెలంగాణ జాగృతి కండువా వేసుకొని కష్టాలలో ఉన్న ప్రజలని పలకరించడానికి బయలుదేరారు.

ఈసారి ఆమెకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ అవసరమనిపించింది. కనుక ఈ అంశం పట్టుకొని ప్రసంగాలు చేస్తున్నారు.

Also Read – జగన్ యాత్రలకు అర్దాలు వేరయా..!

వారి కోసం తాను పోరాడుతానని, జూలై 16,17,18 తేదీలలో మూడు రోజులు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘రైల్ రోకో’ చేద్దామని కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.

సొంత పార్టీ వారే ఎవరూ ఆమె వెంట రావడం లేదు కానీ రాష్ట్రంలో బీసీలందరినీ పోగేయాలని అనుకుంటున్నారు. రాజకీయ ఒంటరితనం వలన కలిగిన వైరాగ్యంలో ఆమె బీసీ రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఒకవేళ తండ్రి ఆమెని పిలిచి మళ్ళీ పార్టీలో పనిచేసుకోమని చెపితే, బీసీ రిజర్వేషన్స్ గురించి ఇప్పుడు హడావుడి చేయవద్దని చెపితే ఆమె ‘రైల్ రోకో’లు చేస్తారా?అంటే కాదనే అందరికీ తెలుసు.

Also Read – జనసేన ఎమ్మెల్యే లు: అరుంధతి నక్షత్రలా.?


నిజానికి ఆమె బిఆర్ఎస్ పార్టీలో తన స్థానం పదిలమా కాదా?పదిలమైతే ఆమె చెప్పిన ‘కేసీఆర్‌ చుట్టూ తిరిగే దెయ్యాల’ సంగతి ఏమిటి?ఒకవేళ బిఆర్ఎస్ పార్టీలోకి ‘నో ఎంట్రీ’ అంటే, తన పరిస్థితి ఏమిటి? అని కల్వకుంట్ల కవిత ముందు ఆలోచించుకోవాలి. ఆ తర్వాత ఏమైనా చేసుకోవచ్చు.