బోడ బోణి తెరాస కి కలిసొస్తుందా.?

Boda Janardhan Joins Party Boost

ఈ నెల 25 న కవిత తన కొత్త రాజకీయ పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటించడంతో పాటుగా బిఆర్ఎస్ అధినాయకత్వం పై సీఎం రేవంత్ పై దూకుడుగా విమర్శలు చేసారు. అలాగే తెలంగాణలో రాబోయేది తెరాస ప్రభుత్వమే అని, తానూ తెలంగాణ ప్రజలకు తల్లిగా పాలన చేస్తానంటూ సభా వేదిక మీద చాల కాన్ఫిడెంట్ గా ప్రకటించారు కవిత.

అయితే ఇన్నాళ్లు జాగృతి పేరు మీద రాజకీయ సాగించిన కవిత తన రాజకీయంతో తన వైపుకి ఎవరిని ఆకర్షించలేకపోయారు. కానీ తెరాస పార్టీ పేరు ప్రకటించిన తరువాత కవిత పార్టీకి తన వలసతో బోణి కొట్టారు సీనియర్ నేత, మాజీ మంత్రి బోడ జనార్దన్ రెడ్డి.

ADVERTISEMENT

ఈ రోజు జూబ్లీహిల్స్ లోని తెరాస పార్టీ కార్యాలయంలో కవితను కలిసిన బోడ జనార్దన్ ఆమెతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే తన అనుచరులతో కలిసి కవిత తెరాస లో చేరబోతున్నట్టు ప్రకటించారు.

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాజకీయాలలో టీడీపీ పార్టీ తరుపున వరుసగా నాలుసార్లు విజయం సాధించి టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం బోడ జనార్దన్ సొంతం. ఈ నేపథ్యంలో తెరాస ను తెలంగాణలో క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసి పార్టీకి తనవంతు సేవ చేస్తానంటూ బోడ ప్రకటించడం తెరాస కు రాజకీయంగా శుభ సంకేతం అనే చెప్పాలి.

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో జనార్దన్ రాజకీయంగా చాల బలమైన నేతగా చెప్పవచ్చు. గతంలో కార్మిక శాఖకు మంత్రిగా పని చేయడంతో సింగరేణి బొగ్గు గనుల మీద కూడా ఆయనకు మంచి పట్టుకున్న మాట వాస్తవం.

అయితే కవిత తెరాస కి మొట్టమొదటి వలస నేతగా బోణి కొట్టిన బోడ జనార్దన్ చేరిక తెరాస కు రాజకీయంగా కలిసొస్తుందా.? ఆయన చేరిక మరికొంతమంది సీనియర్ నేతలను తెరాస వైపు చూసేలా చేస్తుందా.? బిఆర్ఎస్ నేతలను కవిత తన తెరాస వైపుకు ఆకర్షించగలుగుతుందా.? ఇలా అనేక ప్రశ్నలు తెరాస కేంద్రంగా సాగుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories