లక్ష్యానికి దూరంగా నిరుపేద దళితుల మూడెకరాల పంపిణీ

KCR 3 Acres of Dalit Land Schemeరాష్ట్రంలో భూమిలేని నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల భూ పంపిణీ చేస్తామని గొప్పగా చెప్పిన ఆ పధకం గత మూడున్నరేళ్లలో తూతూమంత్రంగానే సాగుతుంది. తొలి ఏడాదికే రూ.1000 కోట్లు ఖర్చుచేయాలని భావించినప్పటికీ ఇప్పటికి సగం కూడా ఖర్చు పెట్టలేదు. రంగారెడ్డి, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో రెండేళ్లుగా ఒక్క లబ్ధిదారుడికీ భూ పంపిణీ జరగలేదు.

కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఎకరా గరిష్ఠ ధర రూ.7 లక్షలుగా సర్కారు ఖరారు చేసింది. అయినప్పటికీ చాలా చోట్ల భూములు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో గవర్నమెంట్ కూడా ఈ పథకంపై పెద్దగా దృష్టి పెట్టడంలేదు.

ADVERTISEMENT

మూడున్నరేళ్లుగా ఈ పథకం కింద లబ్ధిదారుల సంఖ్య 9 జిల్లాల్లో వంద కూడా దాటలేదు. వరంగల్‌ అర్బన్‌, హైదరాబాద్‌, భద్రాద్రి, మేడ్చల్‌ జిల్లాలలో భూములు లేనందున ఆ జిల్లాలను మొత్తానికి ఈ పధకం నుండే మినహాయించేసారు. మిగతా 27 జిల్లాల్లోనూ తొమ్మిది జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. రంగారెడ్డి జిల్లాలో అత్యల్పంగా 13 మందికి మాత్రమే భూములు పంచారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇప్పటికైనా గవర్నమెంట్ ఈ పధకం మీద దృష్టి పెడ్తుందని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories