కేసీఆర్ ఈ విషయంలో బాబుని ఆదర్శంగా తీసుకోవాలి..!

KCR

రాజకీయాలలో బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి. ఈ ప్రజాస్వామ్యంలో ఎంత తల పండిన రాజకీయ నాయకుడు అయినా గెలుపుని ఓటమిని సమానంగా తీసుకుని ప్రజల తీర్పుని గౌరవించాల్సిందే.

తెలంగాణ మాజీ ముఖ్యంమత్రి కేసీఆర్ తన ఓటమిని అంగీకరించలేక పోతున్నారో లేక తమ ప్రత్యర్థి అయినా కాంగ్రెస్ పార్టీ గెలుపుని జీర్ణించుకోలేక పోతున్నారో కానీ ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన కేసీఆర్ ప్రతిపక్ష నేత గా అసెంబ్లీకి రాలేకపోతున్నారా..? అనే అనుమానాలు రాజకీయ వర్గాలలో మొదలయ్యాయి.

ADVERTISEMENT

నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానీ కేసీఆర్ ఈ రోజు కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మీద చర్చకు హాజరవుతారు అనుకున్న బిఆర్ఎస్ నేతలకు మళ్ళీ నిరాశనే మిగిల్చారు కేసీఆర్. ఇన్నాళ్ళుగా ప్రభుత్వ అధికారిక హోదా అనుభవించిన కేసీఆర్ తన ఓటమిని ఒప్పుకోలేకపోతున్నారనే విమర్శను మూట కట్టుకుంటున్నారు.

అలాగే తమ రాజకీయ ప్రత్యర్థిగా భావించిన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కేసీఆర్ అంగీకరించలేకపోతున్నారు అనే వార్త కూడా పొలిటికల్ సర్కిల్స్ లో బాగా ప్రచారంలో ఉంది. అయితే ఈ విషయంలో కేసీఆర్ టీటీడీపీ అధినేత చంద్రబాబుని ఆదర్శంగా తీసుకోవాల్సిందే.

కారణానికి వస్తే.., తన పార్టీ తరుపున పోటీ చేసి తన ప్రభుత్వంలో నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్న నేతలు సైతం ఆయనను, ఆయన పార్టీని భూస్తాపిస్తాం చేసేద్దాం అనుకుని రాజకీయాలు చేసినా ఎక్కడ ఓటమికి తలవంచక ప్రతిపక్షం లో సైతం తనవంతు పాత్రను పోషిస్తూ ముందుకెళ్తున్నారు చంద్రబాబు.

ఉదాహరణకు కేసీఆర్ నే తీసుకుంటే టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి ఆశించి అది రాకపోవడంతో బాబుతో విభేదించి ఉద్యమ పార్టీగా తెరాస పార్టీని స్థాపించి అదే చంద్రబాబు పై కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని రాజశేఖర్ రెడ్డి తో కలిసి టీడీపీ పై పోరాటానికి సిద్ధమయ్యారు.

ఆ పొత్తుతో తన లక్ష్యం నెరవేరలేదని తదుపరి ఎన్నికలలో అదే చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పై యుద్దానికి వెళ్లారు కేసీఆర్. ఈ రెండు ఎన్నికలలో కేసీఆర్ పొత్తు పెట్టుకున్న పార్టీలు మారాయి, ఆయన కూర్చున్న స్థానం మారింది కానీ చంద్రబాబు అప్పటికే తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ప్రతిపక్ష నేతగా ఆ పదేళ్లు కూడా అంతే శ్రద్ధతో రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నారు.

ఆ తదనంతరం రాష్ట్ర విభజన తరువాత తన పార్టీలో పుట్టిన నాయకుడే తెలంగాణలో తన పార్టీ గొంతుకోస్తున్న ఇదంతా రాజకీయాలలో సహజమే అంటూ అంతే హుందాగా వ్యవహరించారు. అలాగే నవ్యాంధ్రగా ఏర్పడిన ఆంధ్రపద్రేశ్ రాష్ట్రానికి ఐదేళ్లు ముఖ్యమంత్రి పదవి అనుభవించిన బాబు తదుపరి ఎన్నికలలో తన రాజకీయ అనుభవం అంత వయస్సు లేని నేతల మధ్య ప్రతిపక్ష నేత్రగా అసెంబ్లీకి వెళ్లి ఎన్నో అవమానాలను సైతం ఎదుర్కొని ప్రజాసమస్యల పై ప్రభుత్వాన్ని నిలదీశారు.

చివరికి టీడీపీ జెండాతో రాజకీయంగా ఎదిగిన నేతలే తన భార్యను అసెంబ్లీ వేదికగా అవమానించడంతో అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, మరో 14 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ప్రజలిచ్చిన రెండు అవకాశాలను సమాన దృష్టితో చూసి, తనతో సమానమైన నాయకులతోనూ, తనకన్నా చిన్న వయస్సు ఉన్న నాయకులతోనూ రాజకీయాలు చేస్తూ ఎప్పుడు ప్రజా జీవితంలోనే ఉన్నారు.

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాంపు ఆఫీస్, ఫామ్ హౌస్ లో సేద తీరుతూ ఇప్పుడు ప్రజలతో పనేముంది అనుకోలేదు, ప్రతిపక్షంలో ఉన్నాం ఈ నాలుగేళ్లు సైలెంట్ గా ఉండి ఎన్నికలకు నాలుగు నెలల ముందు బయటకొచ్చి ప్రభుత్వ విధానాల పై పోరాడదాం అంటూ ఎన్నడూ ఆలోచించలేదు బాబు.ప్రతిపక్షమైన, అధికార పక్షమైన, గెలుపైనా, ఓటమైన ఒకటే దృష్టితో చూడగలిగినవాడే నిజమైన నాయకుడు.

అధికారం ఉంది కదా అని నోటికి అడ్డు అదుపులేకుండా ప్రతిపక్ష నాయకులను తూలనాడితే ప్రజలిచ్చే అనుకోని తీర్పులతో ఓటమిని అంగీకరించలేక, ఇలా ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ADVERTISEMENT
Latest Stories