
వైసీపీ, బిఆర్ఎస్ పార్టీలలో ఓ సారూప్యత ఉంది. అవి ఏనాడూ ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోలేదు. కలిసి పోటీ చేయలేదు. మాజ్లీస్ వంటి పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా అదీ పాతబస్తీ వరకే. ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే పయనిస్తోంది.
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ తప్ప మరొకపార్టీ అధికారంలో ఉండకూడదనుకోవడం, ఈ కారణంగా ఓట్లు, సీట్లు, పదవులు, అధికారం ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడకపోవడం వంటి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి.
Also Read – రాజకీయ ప్రతీకారాల కోసమే ప్రజలెన్నుకోవాలా?
కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలనుకున్నప్పుడు, దేశంలో అన్ని పార్టీలు తన నాయకత్వంలో పనిచేయాలని కోరుకోవడం వలన రాజకీయాలలో ఏకాకిగా మిగిలిపోయారు.
ఏపీలో వామపక్షాలతో సహా ఏ పార్టీ కూడా వైసీపీతో పొత్తులు పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. కేంద్రంలో బీజేపి అధికారంలో ఉన్నందున దాంతో పొత్తులు పెట్టుకోవాలని ఉన్నా, ఏపీలో దళిత, బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా క్రీస్టియన్, ముస్లిం ఓటు బ్యాంకు కోల్పోతాననే భయంతో బీజేపితో పొత్తుకి జగన్ సిద్దపడలేదు.
Also Read – బనకచర్లపై చర్చ వద్దట.. ఎందుకు?
కానీ బీజేపికి పార్లమెంటులో అవసరమైనప్పుడల్లా మద్దతు ఇస్తూ లోపపాయికారిగా దాంతో స్నేహం కొనసాగించారు.
వైసీపీ ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే, ఆ బలహీనతని కూడా బలంగా జగన్ నమ్మించాలని ప్రయత్నించారు.
Also Read – పేర్ని అత్యుత్సహం: అరవడానికా.? కరవడానికా.?
తాను సింహంలా సింగిల్‌గా ఎన్నికలను ఎదుర్కొంటుంటే చంద్రబాబు నాయుడు భయంతో జనసేన, బీజేపిలతో పొత్తులు పెట్టుకొన్నారని జగన్ ఎద్దేవా చేసేవారు.
కానీ రెండు సింగిల్ సింహాలు జగన్, కేసీఆర్ మద్య లోపాయికారి స్నేహం ఉందని, పరస్పరం సహకరించుకుంటాయనే విషయం అందరికీ తెలిసిందే.
వైసీపీ, బిఆర్ఎస్ పార్టీల తప్పుడు విధానాల కారణంగా రాజకీయాలలో ఒంటరిగా మిగిలిపోయాయని అర్దమవుతూనే ఉంది. కానీ ఆ రాజకీయ ఒంటరితనాన్ని కూడా అవి గొప్పగా అభివర్ణించుకోగలిగాయి. కానీ ఆ కారణంగానే అవి ఎన్నికలలో గెలవలేక చతికిలపడ్డాయి.
ఓ రాజకీయ పార్టీ ఒంటరిగా ఉండటం, నడిపించడం పెద్ద గొప్ప విషయమేమీ కాదు. అయినా వైసీపీ, బిఆర్ఎస్ పార్టీలు దయనీయ స్థితిలో ఉన్నాయిప్పుడు.
కనుక మూడు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం నడిపించడం ఇంకా కష్టమే కదా?కానీ సిఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మూడు పార్టీలు కలిసి చక్కగా ప్రభుత్వం నడిపిస్తున్నాయి. ఇక ముందు కూడా కలిసే సాగుతామని గట్టిగా చెపుతున్నాయి కూడా!
కేసీఆర్, జగన్ ఇద్దరూ ఒంటరిగా ఒంటరి పార్టీలను నడపలేక తడబడుతుంటే, సిఎం చంద్రబాబు నాయుడు మూడు పార్టీలను కలిపి విజయవంతంగా ప్రభుత్వం నడిపిస్తున్నారు. అంటే సిఎం చంద్రబాబు నాయుడి రాజకీయ విదానాలే సరైనవని అనుభవపూర్వకంగా నిరూపితమైనట్లే కదా?