ఒకరు పేరు మార్పుతో..మరొకరు విధానం మార్పుతో..!

KCR and Prashant Kishor facing political challenges after major decisions

రాజకీయాలలో కూడా కొన్ని సెంటిమెంట్స్ పార్టీల భవితవ్యాన్ని ఆయా పార్టీ నాయకుల భవిష్యత్ ను నిర్దేశించగలవు అనే దానికి కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ చక్కటి ఉదాహరణలుగా నిలుస్తున్నారు.

ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా రూపొందిన తెరాస 2023 ఎన్నికల ముందు బిఆర్ఎస్ గా రూపాంతరం చెందింది. రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వరకు గులాబీ కారు ప్రయాణం అంటూ కేసీఆర్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం ఆయన రాజకీయ భవిష్యత్ ని తెరాస భవితవ్యాన్ని నైరాశ్యంలో నెట్టేసింది.

ADVERTISEMENT

అలాగే కేసీఆర్ ను ఒక అజ్ఞాత రాజకీయ నాయకుడిగా బిఆర్ఎస్ ను ఉనికి కోసం పోరాడే ఒక ప్రతిపక్ష పార్టీగా మార్చేసింది. ఇంకా సొంత కుటుంబ సభ్యుల నుంచి పార్టీ ఊహించని వ్యతిరేకతను ఎదుర్కొంది, అనేక రాజకీయ అవినీతి ఆరోపణలను మోసింది.

అలాగే దేశ రాజకీయ చరిత్రలోనే ఒక ప్రముఖ రాజకీయ వ్యూహకర్తగా పేరు గాంచిన ప్రశాంత్ కిషోర్ తన విధానాన్ని మార్చుకుని పొలిటికల్ వ్యూహకర్త నుంచి పొలిటికల్ స్టార్ నాయకుడిగా ఎదగాలి అని తీసుకున్న ఒక్క నిర్ణయం ఆయన గత చరిత్రను తుడిచేసింది, భవిష్యత్ ను ప్రశార్ధకంలో పడేసింది.

జన్ సూరజ్ పార్టీగా బీహార్ రాజకీయాలలో అడుగు పెట్టిన ప్రశాంత్ కిశోర్ ఘోర ఓటమి అవమానం భారాన్ని మోస్తున్నారు. ఇన్నాళ్లు ఇతర పార్టీల గెలుపు కోసం ఆయా పార్టీల అధికారం కోసం వ్యూహాలు రచించి సక్సెస్ అందుకున్న పీకే ఇప్పుడు తన సొంత పార్టీ గెలుపు కోసం వేసిన ఏ వ్యూహం కూడా ఫలించలేదు అనే విమర్శలను ఎదుర్కుంటున్నారు.

అంతే కాదు తన పార్టీ నేతల గెలుపు కోసం, JSP అధికారం కోసం పీకే జరిపిన పాదయాత్రలు, ప్రచార పర్యటనలు, ఎన్నికల ప్రణాళికలు, ఆయన చేసిన రాజకీయ ప్రసంగాలు ఏమి కూడా ఆయన పార్టీని ఒక్క సీటులో కూడా గెలిపించలేకపోయాయి.

239 స్థానంలో పోటీ చేసిన JSP కేవలం 2 % ఓటు బ్యాంకుతో సరిపెట్టుకుని ఇతరుల స్థానం కన్నా కిందకు పరిమితమయ్యింది. మరి పీకే రాజకీయ వ్యూహాలు, ప్రణాళికలు ఎటువైపుకి పోయాయి అంటూ పీకే పై ఎన్నో ప్రశ్నలు మరెన్నో విమర్శలు వేలెత్తి చూపుతున్నాయి.

ఇలా కేసీఆర్ పార్టీ పేరు మార్పుతో తన పార్టీ భవితవ్యాన్ని, తన భవిష్యత్ ని ఫామ్ హౌస్ కి పరిమితం చేసినట్టు ప్రశాంత్ కిషోర్ తన వ్యూహకర్త విధానాలను మార్చుకుని తన వృత్తిని తన ప్రవృత్తిని ప్రశ్నార్ధకంలోకి నెట్టేసుకున్నారు.

ADVERTISEMENT
Latest Stories