పార్టీ ఓటమి నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీ లో తన గళం వినిపించింది లేదు. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ కు ఎదురుపడింది లేదు. ఇప్పటి వరకు బిఆర్ఎస్ పార్టీ ని జోడెడ్ల మాదిరి ఒక పక్క కేటీఆర్ మరోపక్క హరీష్ ముందుండి నడిపిస్తున్నారు.
తన ప్రభుత్వంలో అరెస్టయిన టీడీపీ సాధరణ నాయకుడు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ గా ఉండడాన్ని కేసీఆర్ సహించలేకపోతున్నారా.? గతంలో రేవంత్ పై బిఆర్ఎస్ చూపిన వివిక్షత నేడు కేసీఆర్ కు ఎదురవుతుంది అనే భయం కేసీఆర్ ను అసెంబ్లీ గడప తొక్కనివ్వడం లేదా.?
అయితే ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి మరోలెక్క అన్నట్టుగా కేసీఆర్ రాజకీయ ముఖ చిత్రాన్ని బిఆర్ఎస్ పార్టీ రాజకీయ భవిష్యత్ ని కాళేశ్వరం నివేదిక శాసించనుంది. కాళేశ్వరం అవినీతి, అక్రమాల పై రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ నివేదిక కేసీఆర్ ను ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ బాధ్యుడిగా చూపింది.
అలాగే కేసీఆర్ తో పాటుగా మరికొంతమంది సీనియర్ అధికారులను, ఇంజనీర్లను ఈ తప్పులో భాగస్వాములను చేసింది. దీనితో ఈ కమిషన్ మొత్తం 19 మంది అధికారులను బాధ్యులుగా గుర్తించింది. ఇక చేతికి అంది వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకుని కాళేశ్వరం అవినీతి మీద చర్చ, కమిషన్ నివేదిక మీద విశ్లేషణ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు సిద్దమయ్యింది.
ఇక ఇప్పటికైనా కేసీఆర్ తన అహాన్ని పక్కన పెట్టి రేవంత్ సర్కార్ ఏర్పాటు చేయబోతున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యి తన నొర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలాకాకుండా కేసీఆర్ తన ఈగోను వదలకుండా బిఆర్ఎస్ పై పడిన కాళేశ్వరం అవినీతి మరకలు తుడవకుండ గులాబీ కారును ప్రమాదంలో నెట్టనున్నారా.?






