
వైసీపీ డిఎన్ఏ కు బ్రాండ్ అంబాసిడర్ మాదిరి గత ఐదేళ్లు మీడియాలో, పార్టీ కార్యకర్తల మధ్యన తన హవా కొనసాగించిన కొడాలి నాని చాల కాలం తరువాత తన సొంత నియోజకవర్గమైన గుడివాడ చేరుకున్నారు.
Also Read – సైకో రాజకీయాలు చేయవద్దని చెప్పా: పేర్ని నాని
గత కొద్దీ నెలల నుంచి అనారోగ్య సమస్యలతో రాష్ట్ర సరిహద్దులు దాటిన కొడాలి, అరెస్టు భయంతో ఏపీలో అడుగు పెట్టడానికి వెనకడుగు వేస్తున్నారు. అయితే రావి వెంకటేశ్వర రావు బట్టల దుకాణం పై దాడి కేసులో నాని పై నమోదయిన కేసు విషయంలో ఎట్టకేలకు గుడివాడ సౌమ్యుడు సొంత నియోజకవర్గాన్ని రాక తప్పలేదు.
ఈ కేసు విషయంలో తనకు ముందస్తు బెయిలు కావాలంటూ నాని హై కోర్ట్ లో వేసిన పిటిషన్ కు గాను, న్యాయస్థానం కింద కోర్ట్ ను ఆశ్రయించాలని సూచించింది. దీనితో ఇక చేసేదిమి లేక ఈ వైసీపీ అందగాడు గుడివాడ చేరుకున్నారు.
Also Read – కోటా శ్రీనివాసరావు ఇక లేరు
అయితే నాడు అధికారంలో ఉన్న ఐదేళ్లు రోడ్డు మీదకు వచ్చింది మొదలు, మీడియా కనిపిస్తే చాలు బాబు, లోకేష్ మీద బూతులతో విరుచుకుపడిపోయే కొడాలి నేడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా వచ్చిన ఏపీని పూర్తి చేసుకున్నారు.
అయితే కొడాలి లో వచ్చిన ఈ మార్పు తాత్కాలికమా.? లేక అధికారం మనది కాదు అన్న ఆత్మ రక్షణలో భాగమా.? లేక తన స్నేహితులు, వైసీపీ సన్నిహితులు ఒక్కొక్కరు అందగాళ్లుగా మారి అరెస్టులవుతున్న తీరుకు కొడాలి ఇలా మారిపోయారా.? లేక లోకేష్ చెపుతున్నట్టు రెడ్ బుక్ ప్రభావమా.? అనేది తేలాలి.
Also Read – ఒకరు సస్పెండ్.. మరొకరు సస్పెన్స్.. అయినా తీరు మారలే!
అయితే ఏది ఏమైనా కొడాలి లో వచ్చిన ఈ మార్పు శాశ్వతం కావాలని, మిగిలిన వైసీపీ నాయకులు కూడా కొడాలి మాదిరి చేసిన తప్పు తెలుసుకుని సరిదిద్దుకునేలా, రాష్ట్రంలో రాజకీయ విలువలు నిలబెట్టేలా రాజకీయం చెయ్యాలని ఆశిద్దాం.