devineni-avinash-lella-appi-reddy

వైసీపి అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు, వారి అనుచరగణం పేట్రేగిపోయి టిడిపి నేతలు, కార్యకర్తలు, వారి కార్యాలయాలపై దాడులు చేశారు. చివరికి చంద్రబాబు నాయుడు నివాసంపై కూడా దాడికి ప్రయత్నించారు. ఎందువల్ల అంటే ఎప్పటికీ తామే అధికారంలో ఉంటామనే ధీమాతో… తాము ఏం చేసినా పోలీసులు, న్యాయస్థానాలు తమని ఏమీ చేయలేవనే ధీమాతో… లేకుంటే అంతగా పేట్రేగిపోయేవారే కాదు కదా?

Also Read – ఇలా అయితే ఎలా కవితక్కా?

జగన్‌ మాటలు నమ్మి, ఆయన మెప్పు కోసం చేయకూడని తప్పులన్నీ చేసి ఇప్పుడు వైసీపి నేతలు జోగి రమేష్, అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, రఘురాం తదితరులు ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.

కానీ ఇటువంటి కేసులు, విచారణలకు బెదిరిపోయే రకం కాదు వారు. కనుక పోలీసులు పిలిచినప్పుడల్లా కాలర్ ఎగరేసుకొని మరీ విచారణకు వస్తున్నారు. తమని ప్రశ్నిస్తున్న పోలీసులనే ఎదురు ప్రశ్నిస్తూ, బెదిరిస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక పోలీస్ అధికారులు తలలు పట్టుకొంటున్నారు.

Also Read – జైల్లో సౌకర్యాలు లేవు… ఇలా అయితే ఎలా?

వారందరూ టిడిపి కార్యాలయంపై దాడులు చేశారని తెలిసి ఉన్నప్పటికీ చట్టప్రకారం అది నిర్ధారించుకోవాలి. సాక్ష్యాధారాలను కోర్టుకి సమర్పించాల్సి ఉంటుంది కనుక పోలీసులు వారిని మళ్ళీ మళ్ళీ అడగాల్సివస్తోంది. కానీ వారు మాత్రం ఏ మాత్రం జంకకుండా తాము ఎటువంటి తప్పు చేయలేదని, దాడికి పాల్పడినవారు ఎవరో తమకు తెలియదని చెపుతున్నారు.

కనుక వారిని ఆ విదంగా ప్రశ్నించి నేరం చేసిన్నట్లు ఒప్పించాలనుకోవడం అమాయకత్వమే అవుతుంది. అయినా వివేకా హత్య కేసు, కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులలోనే పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన వైసీపి నేతలకు ఈ కేసు… విచారణా ఓ లెక్కా?

Also Read – యుద్ధం మద్యలో ఈ బేరాలేంటి ట్రంప్‌ గారు?

కనుక వైసీపి నేతలపై ప్రభుత్వం ఎన్ని కేసులు నమోదు చేస్తున్నావాటితో ఎవరికీ శిక్ష పడేలా చేయలేకపోవచ్చు. ఒకవేళ నేరం నిరూపించి జైలుకి పంపినా నెల రోజులలోనే బెయిల్‌ తీసుకొని బయటపడగల సమర్దులు వైసీపి నేతలు.

కనుక ఈ కేసులతో టిడిపి సాధించేది ఏమీ ఉండకపోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తమపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని వైసీపి ప్రచారం చేసుకోవడానికి మాత్రం బాగా ఉపయోగపడుతుందని గుర్తుంచుకోవాలి.

కనుక ఆనాడు చెలరేగిపోయిన వైసీపి నేతలని ఇప్పుడు ఏవిదంగా హ్యాండిల్ చేయాలో సిఎం చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవలసి ఉంటుంది.