list-of-central-and-state-government-offices-in-amaravati..

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి ఓ భ్రమరావతిగా మిగిలిపోయింది. చంద్రబాబు నాయుడు, టీడీపీపై వ్యక్తిగత, రాజకీయ ద్వేషం, అసూయతోనే జగన్‌ అమరావతిని వద్దనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజధాని నిర్మించి చరిత్రలో తన పేరు శాశ్వితంగా లిఖించుకోవచ్చని గ్రహించలేక సిఎం చంద్రబాబు నాయుడు అందించిన ఓ సువర్ణావకాశాన్ని జగన్‌ కాలదన్నుకున్నారు.

జగన్‌ అసూయ లేదా అసమర్దత కారణంగా ఈ సువర్ణావకాశం మళ్ళీ సిఎం చంద్రబాబు నాయుడికే దక్కింది. ఈసారి ఎన్నికలలోగా అమరావతి నిర్మాణం పూర్తిచేసి ప్రజలను ఓట్లు అడగాలని అనుకుంటున్నారు. కనుక అమరావతి పనులు శరవేగంగా జరిపిస్తున్నారు. అమరావతిలో ఇప్పటికే పలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించింది. వాటిలో పనులు వివిద దశలలో ఉన్నాయి.

Also Read – పేర్ని లీక్స్…చాల వైలెంట్ గురు

తాజాగా సోమవారం పురపాలకశాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు భూకేటాయింపులకు ఆమోదముద్ర వేశారు. ఇప్పటి వరకు అమరావతిలో 64 సంస్థలకు 884 ఎకరాలు కేటాయించామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో ఏర్పాటు కాబోతున్న సంస్థలు, కార్యాలయాలకు భూకేటాయింపులు ఇవే..

సీబీఐ: 2 ఎకరాలు,

Also Read – ఒకరు సస్పెండ్.. మరొకరు సస్పెన్స్.. అయినా తీరు మారలే!

జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా: 2 ఎకరాలు,

ఆదాయపన్ను శాఖ కార్యాలయం: 2 ఎకరాలు,

Also Read – కూటమి పై సామాన్యుడి ఆగ్రహం…

రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్‌కు: 5 ఎకరాలు,

ఏపీ గ్రామీణ బ్యాంక్: 2 ఎకరాలు,

ఏపీ కోఅపారేటివ్ బ్యాంక్: 3 ఎకరాలు,

బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్: 0.5 ఎకరం,

ఇంటలిజన్స్ ప్రత్యేక పరిశోధన విభాగం (ఎస్ఐబీ): 0.5 ఎకరం,

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 0.4 ఎకరం,

బీజేపి ప్రధాన కార్యాలయం: 2 ఎకరాలు.

అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నిటికీ కలిపి ఒకే సచివాలయం, వాటిలో పని చేసే ఉద్యోగుల కోసం నివాస సముదాయాలకు రాష్ట్ర ప్రభుత్వం 22.53 ఎకరాలు కేటాయించింది.

కేంద్ర సచివాలయం నిర్మాణం కొరకు రూ.1,458 కోట్లు, ఉద్యోగుల నివాస సముదాయం కొరకు రూ.1,329 కోట్లు కలిపి మొత్తం రూ.2,787 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.

ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖాతటర్ అధికారిక ఉత్తర్వులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు అందించారు.




కేంద్ర ప్రజా పనుల విభాగం ఆధ్వర్యంలో 5.53 ఎకరాలలో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (కేంద్ర సచివాలయం), 17 ఎకరాలలో ఉద్యోగుల గృహ సముదాయం నిర్మాణాలు జరుగుతాయి.