ఆదిలోనే హంస పాదు అనే సామెత మాదిరి ఇప్పుడిప్పుడే రాజకీయ జెండా గా మారుతున్న కవిత జాగృతి కి అప్పుడే వందల కోట్ల అవినీతి మరక అంటించేసారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మధుయాష్కీ.
కవిత బీజేపీ వదిలిన బాణం, బిఆర్ఎస్ వదిలించుకున్న భారం అనేలా మధుయాష్కీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కవిత కాంపౌండ్ లో అలజడిని సృష్టిస్తున్నాయి. కేసీఆర్ కు కవిత లేఖ, ఆపైన జరుగుతున్న పరిణామాలు అన్ని కూడా బీజేపీ పద్మవ్యూహంలో భాగమే అనేలా ఈ కాంగ్రెస్ నాయకుడు అటు కవితను ఇటు బీజేపీ ని టార్గెట్ చేస్తున్నారు.
తెలంగాణలో బీజేపీ బలోపేతం అవ్వాలంటే బిఆర్ఎస్ బలహీనపడాల్సిందే అన్న అభిప్రాయంలో ఉన్న బీజేపీ అధిష్టానం అందుకు అనుగుణంగా ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఇరుకున్న కవిత తో తెరచాటు రాజకీయం నడుపుతున్నారు అంటూ వాదిస్తున్న మధు, కవిత జాగృతి పేరుతో 800 కోట్ల అవినీతికి పాల్పడిందంటూ ఆరోపిస్తున్నారు.
ఆ అవినీతి సొమ్మును జాగ్రత్త చేసుకునే పనిలో భాగమే జాగృతి బలోపేత కార్యక్రమాలు అంటూ ఇప్పుడే రాజకీయ ఓనమాలు దిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్న కవిత జాగృతి మీద వందల కోట్ల అవినీతి మరకలు అంటుకున్నాయి. అయితే ఈ అవినీతి మరక కవిత కు గాను కేసీఆర్ రెండవ కన్నుగా భావించే జాగృతి కానీ అంత మంచిది కాదు.
ఇప్పటికే కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయ్యి తీహార్ జైలు దాక వెళ్లివచ్చారు. దీనితో ఆ కేసు అటు బిఆర్ఎస్ కు ఇటు తండ్రి కేసీఆర్ కు మాయని మచ్చను తీసుకువచ్చింది. అలాగే కవిత రాజకీయ అబవిష్యత్ ను ప్రశ్నార్ధంకంలోకి నెట్టింది.
ఇక ఇప్పుడు జాగృతి తో తెలంగాణలో సొంత కుంపటి ఏర్పాటు చేయాలనీ చూస్తున్న కవితకు ఈ వందల కోట్ల అవినీతి మరకలు కవిత రాజకీయ అడుగులకు బ్రేకులు వేసే ప్రమాదం ఉంది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ నాయకుడి ఆరోపణలను పరిగణలోకి తీసుకుని విచారణ చేపడితే కవిత జాగృతి అవినీతి వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.’
మరి రేవంత్ సర్కార్ ఆ దిశగా విచారణకు అడుగులు వేస్తుందా.? జాగృతి కి అవినీతి మరకలు నిజమైతే ఆ మరకలు అటు బిఆర్ఎస్ పై కూడా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఇలా తెలంగాణ రాజకీయాలు మొత్తం కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ లు కవిత చుట్టూ తిరుగుతూ అటు గులాబీ కి ఊపిరాడకుండా చేస్తున్నాయి.
అయితే అటు కవిత విషయానికొస్తే ఇప్పటికే లిక్కర్ స్కాం లో కడిగిన ముత్యం లా బయటకొస్తాను అంటూ చెప్పిన కవిత కేవలం బెయిల్ అనే పాలిష్ తో మాత్రమే బయటకొచ్చారు. ఇప్పుడు జాగృతి పై అవినీతి ఆరోపణలు రావడంతో కనీసం ఈ విషయంలో అయినా కవిత కడిగిన ముత్యమేనా.? అన్న ప్రశ్నలు తెలంగాణ రాజకీయాలలో వినిపిస్తాయి.




