Election Commission

మహారాష్ట్ర, ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ఈసీ ప్రకటించింది. మహారాష్ట్రలో ఒకేవిడతలో నవంబర్‌ 20వ తేదీన, ఝార్ఖండ్‌లో నవంబర్‌ 13,20 తేదీలలో రెండు విడతలలో పోలింగ్‌ జరుగుతుంది. నవంబర్‌ 23న రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికలలో కాంగ్రెస్‌ కంగు తినగా, జమ్మూ కశ్మీర్‌లో బీజేపీ కంగు తింది. మరోవిదంగా చెప్పాలంటే హర్యానాలో బీజేపీ గెలవగా, జమ్మూ కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కలిసి కాంగ్రెస్‌ అధికారంలో భాగస్వామి అయ్యింది.

Also Read – నాగబాబు వ్యాఖ్యలు…వర్మకు కౌంటరా.?

కనుక ఆ ఎన్నికల ఫలితాలను రెండు పార్టీలు తమకు అనుకూలంగా అన్వయించుకొని తృప్తి పడ్డాయి. ఇప్పుడు కీలకమైన మహారాష్ట్రలో, ఝార్ఖండ్ రాష్ట్రాలలో ఆ రెండు పార్టీలు మళ్ళీ తలపడి తమ సత్తా చాటుకోవలసి ఉంటుంది. మహారాష్ట్రలో ఒకప్పుడు శివసేన చాలా బలంగా ఉండేది. బీజేపీ దానిని ఏక్ నాధ్ షిండే అనే కట్టప్పతో నిలువునా రెండుగా చీల్చేసి బలహీనపరిచి మహారాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చేసింది. కనుక మహారాష్ట్రపై బీజేపీ పట్టు సాధించిన్నట్లే ఉంది. కానీ కొన్ని జిల్లాలలో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి. వాటి నుంచి గట్టి పోటీ ఉంటుంది కనుక బీజేపీ అవలీలగా గెలవలేదు.

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌పై ఈడీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం ద్వారా ఆ రాష్ట్ర రాజకీయాలపై బీజేపీ పట్టు సాధించవచ్చని అనుకుంది. కానీ ఆయనని అరెస్ట్ చేయడం రాజకీయంగా చాలా పెద్ద పొరపాటని బీజేపీ గ్రహించింది. కనుక ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌, మిత్రపక్షాలకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావించవచ్చు.

Also Read – కన్నప్ప తీయడం కూడా శివలీలే!

ఈసారి కూడా ఓ రాష్ట్రంలో బీజేపీ, మరో రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలిస్తే దేశంలో బీజేపీకి ఎదురుగాలి పెరిగిన్నట్లే భావించవచ్చు.

Also Read – అవినీతిని సెల్ఫ్ సర్టిఫై చేసుకుంటున్నారుగా!