మహేష్ సినిమా గురించి సమాచారం ఇచ్చారు!

Mahesh babu - Ar Murugadoss Shooting newsతమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న సినిమా గురించి అధికారిక సమాచారం వెలువడక అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ సినిమా ప్రారంభమైన నాటి నుండి మురుగదాస్ ఒకే ఒక్క ట్వీట్ ‘బ్లాక్ బస్టర్ ఆన్ ది వే’ అని మహేష్ కు చెప్పడం తప్ప, ఒక్క సమాచారం కూడా వెల్లడించలేదు. టాలీవుడ్ వర్గీయులకే కాదు, కనీసం కోలీవుడ్ నుండి కూడా ఎలాంటి సమాచారం వెల్లడికావడం లేదు.

ఒకటి, రెండు సార్లు కమెడియన్ ప్రియదర్శన్ చిత్ర షూటింగ్ విశేషాలు చెప్పగా, తాజాగా సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్, ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ ను వెల్లడించారు. ముంబైలో ఈ సినిమా ఇంట్రడక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని చెప్పారు. ఆకలి మీదున్న ప్రిన్స్ అభిమానులకు ఈ వార్త మిక్కిలి సంతోషాన్నిచ్చిందని చెప్తూ… ప్రిన్స్ ఫ్యాన్స్ సంతోష్ శివన్ కు రిప్లైల మీద రిప్లైలు ఇస్తున్నారు. ఈ షెడ్యూల్ తో టాకీ పార్ట్ మొత్తం పూర్తవనుందని, పాటల చిత్రీకరణ ఒక్కటే ఉంటుందని ట్రేడ్ వర్గాల కీలక సమాచారం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories