టాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు మనవడు అర్చిత్ జన్మదిన వేడుకలలో ప్రిన్స్ మహేష్ బాబు, తన సతీమణి నమ్రతతో పాటు హాజరైన విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టాయి. ఇతరుల ప్రైవేటు వేడుకలకు హాజరు కాని ప్రిన్స్, ఈ వేడుకకు విచ్చేయడం టాలీవుడ్ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.
ప్రిన్స్ తో పాటు మెగా హీరో సాయిధరమ్ తేజ్, నందమూరి హీరో కళ్యాణ్ రామ్ లు కూడా ఈ వేడుకలలో ప్రత్యక్షం కాగా, మహేష్ సినిమా తదుపరి దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా దర్శనమిచ్చారు. మాటల సందర్భంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తే చేయగలరా? అని ప్రిన్స్ ను వంశీ పైడిపల్లి అడుగగా, అందుకు ప్రిన్స్ నుండి సుముఖత వ్యక్తమైనట్లుగా ఓ వార్త ట్రేడ్ వర్గాలలో హల్చల్ చేస్తోంది.
‘ముందు మంచి కధ తీసుకురండి… ఖచ్చితంగా చేద్దాం…’ అని ప్రిన్స్ చెప్పిన మాటలు బహుశా సాయిధరమ్ తేజ్ ను ఎక్కడో నిల్చోపెట్టాయేమో అని చెప్పకతప్పదు. అయితే ఇది సాదాసీదాగా అడిగారో లేక నిజంగానే ఏదైనా కధను మనసులో ఉంచుకుని అడిగారో గానీ, దిల్ రాజు సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేయడం మరింత ప్రాధాన్యతను దక్కించుకునేలా చేసాయి. ఇందులో వాస్తవం ఎంతున్నా… ఈ వ్యాఖ్యలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి.


