tollywood-movies-budget

ఇది వితండవాదనే అనిపించవచ్చు కానీ ఇప్పుడు పెద్ద హీరో సినిమా అంటే కనీసం రూ.4-500 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే… కనీసం 2-3 ఏళ్ళు తీయాల్సిందే అన్నట్లు సాగుతోంది.

Also Read – ‘నీలి’ నిందలు ‘పసుపు’తో కడగాలా..?

కానీ ఆనాడు ఏ టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలో ఏఎన్నార్, ఎన్టీఆర్‌, కృష్ణ వంటివారు ఏడాదికి 10-12 సినిమాలు ఎలా పూర్తిచేసేవారు? ఆనాడు ప్రతీ రెండు మూడు నెలలకు కృష్ణ, చిరంజీవి, శోభన్ బాబు సినిమా పడుతుంటే ప్రతీదీ సూపర్ హిట్ అయ్యేది కదా?

ఇప్పుడు గొప్ప టెక్నాలజీ, గ్రాఫిక్స్, సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్స్ అన్నీ అందుబాటులో ఉన్నా అలాంటి సూపర్ హిట్ రెండు-మూడు నెలల్లో ఎందుకు పూర్తిచేయలేకపోతున్నారు?

Also Read – వైసీపీ ఇంజ్యురియస్ టూ పాలిటిక్స్..!

ఏ టెక్నాలజీ అందుబాటులో లేని ఆ రోజుల్లోనే మాయాబజార్ సినిమాలో దుంధుభి మ్రోగుతుంటే ఘటోత్కచుడు ఎలా ప్రత్యక్షమయ్యేవాడు?భక్త ప్రహ్లాద సినిమాలో స్తంభంలో నుంచి నరసింహస్వామిని ఎలా చూపారు? నర్తనశాల సినిమాలో అంతగొప్పగా లైటింగ్ ఎఫెక్ట్స్ ఎలా తీశారు?అని ఆలోచిస్తే ఆనాటి ప్రతిభ అద్భుతమనిపిస్తుంది.

ఇప్పుడు ఇంత అత్యద్భుతమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా సామాన్య ప్రేక్షకులు కూడా వేలెత్తి చూపగల తప్పులు ఎందుకు దొర్లుతున్నాయి?

Also Read – జగన్‌, కేసీఆర్‌లను అంబానీ పిలవలేదా… వెళ్ళలేదా?

ఇంత అత్యద్భుతమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఓ సినిమా పూర్తిచేయడానికి 2-4 ఏళ్ళు సమయం ఎందుకు పడుతోంది?

ఆ రోజుల్లో అనేక థియేటర్లలో ఫ్యాన్లు కూడా సరిగా తిరిగేవి కావు… ఏసీలున్న థియేటర్లు పెద్ద నగరాలు, పట్టణాలలోనే ఉండేవి. కానీ మండు వేసవి కాలంలో రిలీజ్ అయిన సినిమాలలో సగానికిపైగా శతదినోత్సవాలు జరుపుకునేవి. దాదాపు 75 శాతం సినిమాలు కనీసం 50 రోజులు ఆడేవి. ఆరోజుల్లో అన్ని సినిమాలు అన్ని రోజులు ఎలా ఆడేవి?

ఇప్పుడు ఐమాక్స్ థియేటర్లు అందుబాటులోకి వచ్చేసినా వందల కోట్లు ఖర్చు చేసిన 2-4 ఏళ్ళు తీసిన సినిమాలు నెలరోజులు కూడా ఎందుకు ఆడటం లేదు?ఇప్పుడు ఇంత టెక్నాలజీ, సౌకర్యాలు అన్నీ అందుబాటులో ఉన్న వాటిని మించిన ‘హండ్రడ్‌ డేస్’ సినిమాలు ఎందుకు తీయలేకపోతున్నారు? కనీసం ‘ఫిఫ్టీ డేస్’ ఎందుకు ఆడటం లేదు.

నేటికీ ఆనాటి సినిమా పాటలు చాలా మందికి కంఠస్థం వచ్చు. నిజానికి ఆ పాట మొదలవగానే అది ఫలానా పాట అని నేటికీ అందరూ గుర్తించగలుతారు. ఆలపించగలుగుతారు కూడా.

ఇప్పుడు ఇన్ని సంగీత సాధనాలు, సౌండ్ ఎఫెక్ట్స్, టెక్నాలజీ అందుబాటులో ఉన్నా ఏ పాట ఒక్క ఏడాది తర్వాత గుర్తు ఉండదు… ఎందువల్ల? అనే సందేహం కలుగుతుంది?వంటి అనేక సమాధానం లభించని ప్రశ్నలు వినబడుతూనే ఉంటాయి.

ఇది వితండవాదనగానే అనిపించవచ్చు. కానీ ఒక సినిమా నిర్మాణం కోసం రూ. 4-500 కోట్లు ఖర్చు చేసి దాంతో 2-3 ఏళ్ళు షూటింగ్‌ తీస్తే అందుకు తగ్గట్లు రిజల్ట్ (కలక్షన్స్‌ కాదు) రావాలి కదా?

ఒక్కో సినిమాకి 2-3 ఏళ్ళు చొప్పున కేటాయిస్తే ఈ లెక్కన పెద్ద హీరోల సినీ కెరీర్‌ ముగిసేలోగా మొత్తం ఎన్ని సినిమాలు చేయగలరు?వాటిలో అన్నీ హిట్ కాకపోయినా పర్వాలేదా?సినీ ఇండస్ట్రీకి ఇది మంచిదేనా?అని ఆలోచిస్తే, ఈ విధానాలలో మార్పు అవసరమనిపిస్తుంది.

కానీ వందల కోట్లు ఖర్చు చేసి ఒక్కో సినిమాని 2-3 ఏళ్ళు తీయడమే గొప్ప అనుకుంటే, పెద్ద హీరో సినిమా అంటే కనీసం 2-3 ఏళ్ళు తీయాల్సిందే అని అనుకుంటే అది చిన్న సినిమాలు, చిన్న హీరోలు, చిన్న సినిమాల దర్శక నిర్మాతలకు వరంగానే భావించి స్వీకరించి ముందుకు సాగిపోవలసిందే.