రాజధానిగా అమరావతికి పార్లమెంట్ లో చట్టబద్ధత లభించిన తరుణంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా ముందుకొచ్చి రాజధానిగా మావిగన్ అంటూ కొత్త పేరును తెరమీదకు తెచ్చారు.
దీనితో ఇక వైసీపీ బ్యాచ్ మొత్తం ఏపీ అభివృద్ధి మావిగన్ తోనే సాధ్యం అంటూ జగన్ కొత్త ప్రతిపాదనను తమ నినాదంగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే మావిగన్ ప్రకటనతో జగన్ ఇప్పటికే అటు రాష్ట్ర ప్రజల చేత విమర్శలు ఎదుర్కుంటున్నారు మరోపక్క సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కి గురవుతున్నారు.
జగన్ పై, వైసీపీ పై మీమ్స్ చేస్తూ సోషల్ మీడియా మొత్తం మావిగన్ ను ట్రేండింగ్ లో ఉంచుతుంది. జగన్ చేసిన ఆ ఒక్క ప్రకటన ఈ స్థాయిలో ట్రోలింగ్ కి గురికావడంతో దాన్ని డైవర్ట్ చేసేందుకు జగన్ తన పార్టీలో ఉన్న కాపు నేతలను రంగంలోకి దింపుతున్నారు.
ముందుగా వైసీపీ కాపు టైగెర్ గా జగన్ వద్ద బిరుదు పొందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా ముందుకొచ్చి ఏపీ అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర రాజధానిగా మావిగన్ యే సరైన నిర్ణయమని జగన్ ప్రకటనకు తన మద్దతును ప్రకటించారు.
ఇక ఆ తరువాత విశాఖ, విజయనగరం జిల్లా వైసీపీ కాపు నేతలు రంగంలోకి దిగారు. ఇందులో మోస్ట్ సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తో పాటుగా ధర్మాన, గుడివాడ అమరనాథ్ లు పాల్గొన్నారు. బొత్స రాజధాని అమరావతి గురించి మాట్లాడుతూ జగన్ ఎక్కడ మా పార్టీ అమరావతికి వ్యతిరేకం అంటూ ప్రకటించలేదుగా.?
ఒక సినిమాకి వెళ్ళినప్పుడు ఈ సినిమా కన్నా ఆ సినిమా బాగుంది అంటాంగా అలాగే ఇది కూడా అమరావతి కంటే మావిగన్ బెటర్ అంటున్నాం అంటూ రాష్ట్ర రాజధాని ని ఒక సినిమాతో పోల్చి చూస్తున్నారు వైసీపీ కాపు నేతలు. అలాగే అమరావతి లో కృష్ణా కరకట్ట పై వెళ్తుంటే శ్మశానమే కనిపిస్తుంది అంటూ అమరావతిని మరోసారి శ్మశానంగా చిత్రీకరించే ప్రయత్నం చేసారు.
అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో రాజధానిగా అమరావతి పై విషం చిమ్మేనందుకు, మావిగన్ ను సమర్ధించేందుకు జగన్ మీడియా ముందుకు వైసీపీ కాపు నేతలను మాత్రమే ఎందుకు ముందుకు తెస్తున్నారు. అంటే జగన్ కోసం ఆ నాయకుల ప్రకటనలు, సమర్ధింపులతో ఆ సామాజికవర్గ నేతల మీద రాష్ట్ర ప్రజలకు ఈసడింపులు, రాజకీయ ద్వేషం కలగాలని జగన్ భావిస్తున్నారా.?
అందుకే జగన్ తన పార్టీలో తన సామాజికవర్గానికి చెందిన అంతమంది ముఖ్య నేతలు ఉన్నా ఇటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని సమర్ధించడానికి అంబటి, బొత్స, ధర్మాన, గుడివాడ వంటి కాపు నేతలనే రంగంలోకి దింపుతున్నారా.? అంటే జగన్ తన పార్టీ రాజకీయ శ్రేయస్సు కోసం తన సామాజికవర్గ నాయకుల రాజకీయ భద్రత కోసం కాపు సామజిక వర్గ నేతల రాజకీయ భవిష్యత్ ని బలిపీఠం ఎక్కించనున్నారా.?




