ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నేతలు తమ అధినేత జగన్ ఆదేశాల మేర ప్రజాయాత్రలు చేప్పట్టిన సందర్భంలో ప్రజల నుండి ఎదురవుతున్న నిరసనలకు తత్వం బోధపడుతున్నట్లు ఉంది. గడప గడపకు కార్యక్రమంలో వైకాపా నాయకులను ఎక్కడిక్కడ నిలదీస్తూ వస్తున్నారు స్థానిక ప్రజలు.
ఇక తమ మాటలతో ప్రజలను మభ్యపెట్టలేం అని భావించిన కొందరు వైసీపీ ముఖ్య నేతలు తమ ప్రభుత్వం ప్రజల మీద మోపిన భారాలను ఒప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు పార్వతీపురం మన్యం జిల్లాలో సామజిక సాధికార యాత్రలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జులు పెంచిన మాట వాస్తవమే అంటూ ధర్మాన నిజం ఒప్పుకున్నారు.
రైతులకు ఉచిత విద్యుత్ అందించడం,రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరగడంతో ప్రైవేట్ కంపెనీల నుండి పెద్ద మొత్తంలో విద్యుత్ కొనుగోలు చేయడం జరిగిందని ఆ మేరకు పెరిగిన విద్యుత్ చార్జీలు ప్రజలు భరించక తప్పదంటూ ధర్మాన ధర్మంగానే వైసీపీ ప్రభుత్వం ప్రజల పై మోపిన భారాన్ని ఒప్పుకున్నారు.ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో వైకాపా నేతలకు తమ ప్రభుత్వ వైఫల్యాలు ఒక్కొక్కటిగా జ్ఞానోదయం అవుతున్నటుంది. ఇక ఎన్నికల నాటికీ ఇంకెన్ని నిజాలు ఒప్పుకుంటారో, ప్రజల మీద మోపిన ఇంకెన్నో భారాలు బయటకొస్తాయో…!




