ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ నేతలకు ఇచ్చిన “గడప _ గడకు” కార్యక్రమంలో పాల్గొంటున్న ఆ పార్టీ నేతలు ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను.., చీత్కారాలను తమ మనసులలో నుండి బయటకు పంపలేకపోతున్నట్లున్నారు. అందుకేనేమో ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకుల మాటలలో తడబాట్లు…,ప్రజలనుండి వస్తున్న వ్యతిరేఖ స్పందన అంతా మీడియా ‘సాక్షి’గా బయటపెడుతున్నారు.
ప్రతిపక్ష పార్టీ అయినా తెలుగుదేశం పార్టీని విమర్శించడానికి మీడియా ముందుకొచ్చిన వైసీపీ కావాలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన సొంత అభిప్రాయమో….., లేక ప్రజల మనసులో భావనో తెలియదు కానీ ఏమాత్రం సంకోచించకుండా…, వైస్సార్ కాంగ్రెస్ వేస్ట్., మేము వేస్ట్.., మా డిస్ట్రిక్ నాయకులు వేస్ట్ అంటూ అనర్గళంగా పార్టీ పై.., పార్టీ నేతల పై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను జగన్ తన గుప్పెటలో పెట్టుకొని ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీ నాయకులను అణిచివేయడానికి., వారికి బెదిరించడానికి ఉపయోగిస్తున్నారనే ప్రతిపక్షాల మాటలను బలపరుస్తూ ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను ఇంత దారుణంగా వాడుకున్న పార్టీ ఏదైనా ఉందా..?మీకు తెలుసు.., మీరు చూసారు…ఈ కాకి వ్యవస్థను ఇంత బాగా వాడుకున్న వైసీపీ వేస్టు….అంటూ మీడియా ప్రతినిధులతో తన అభిప్రాయాలను పంచుకున్నారు సదరు వైసీపీ ఎమ్మెల్యే.
వైసీపీ నేతలు ఇలా తమ సొంత పార్టీ మీద., ఆ పార్టీ నేతల మీద., ఆఖరికి పార్టీ అధినాయకుడు జగన్ మీద నోరుజారిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఒకప్పుడు వైసీపీ మహిళా నేత పుష్ప శ్రీవాణి ఒకటే లైన్ తో మా ప్రభుత్వం ముందుకెళ్తుందని., ‘అవినీతి పాలనే’ మా పార్టీ లక్ష్యం అంటూ నోరుజారారు. ఈ కోవలోకే తాజా నీటిపారుదల శాఖ మంత్రి అంబటి కలెక్టర్ ని వాడు… వీడు అనే స్థాయికి ముఖ్యమంత్రి దిగజారాడు…అంటూ ప్రతిపక్షాల నోటికి చిక్కాడు.
మరో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మా నాయకుడు జగన్ శుక్రవారం…శుక్రవారం కోర్టుకి వెళ్లడం వల్లే మాకు 151 సీట్లు వచ్చాయి అంటూ ప్రసంగించడం…, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా సాక్షాత్తు అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి అంటూ జగన్ ముందే సంబోధించడం…, అలాగే సోషల్ మీడియా స్టార్ అయినా ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని వైసీపీ నాయకుల మీటింగ్స్ కి ప్రజలు రావడం లేదు అంటూ తన ఆవేదనను వ్యక్తపరిచడం ఇలా ఏంతో మంది వైసీపీ నాయకులు తమ అంతరంగాలను ఏదో ఒక రూపంలో మీడియాముందు వ్యక్తపరుస్తూనే వస్తున్నారు.
అయితే ఈ ఆడియో – వీడియో లీకులతో.., వైసీపీ నేతల అంతరంగాలతో…. రానున్న ఎన్నికలలో ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి.



