రోజా గారు తమరి బాధ ఏంటో?

MLA Roja Fires on TDPశుక్రవారం శాసనసభ సమావేశాలు తొలిసారిగా విపక్షం లేకుండా ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష వైకాపా సమావేశాన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే. జగన్ పాదయాత్ర కారణంగా సభకు డుమ్మా కొట్టినా, దానికి ఫిరాయింపుల పై నిరసన అంటూ పేరు పెట్టారు. మరో వైపు ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో గవర్నమెంట్ పై విరుచుపడ్డారు.

ప్రతిపక్షం లేకుండా సభను నడపడం పై ఆమె విరుచుకుపడ్డారు. ఏపీ అసెంబ్లీ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లా మారిందని రోజా విమర్శించారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో శిక్షణ శిబిరాల కార్యక్రమాలు జరిగేలా అసెంబ్లీ మారిందని ఆరోపించారు. ఇదేదో ప్రభుత్వం వైకాపాను సభకు రావద్దు అన్నట్టు రోజా గారు అంటున్నారు.

ADVERTISEMENT

వైకాపా సభ్యులు సభకు రావాలి అనుకుంటే వారిని ఆపేది ఎవరు? వారికి వారే రావొద్దు అని నిర్ణయం తీసేసుకుని మళ్ళి ఏపీ అసెంబ్లీ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లా మారిందని అనడం వారికే రోజా గారికే చెల్లింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే సభకు హాజరవుతామని రోజా తెలిపారు. వారు హాజరు అవ్వకపోతే చంద్రబాబుకి ఏం నష్టం?

ADVERTISEMENT
Latest Stories