వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసు అటకెక్కించేసినట్లేనా ?

MLC Ananth Babu caseఒక గీతను చిన్నదిగా చేసి చూపాలంటే దాని పక్కన మరికాస్త పెద్ద గీత గీయాలి. అలాగే ఒక సమస్య లేదా వైఫల్యం నుంచి మీడియా, ప్రజల దృష్టి మళ్ళించాలంటే అంతకంటే గంభీరమైన అంశంపైకి వారి దృష్టిని మళ్లిస్తుంటాయి ప్రభుత్వాలు.

ఆంద్రప్రదేశ్‌ అధికార వైసిపికి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేయడం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తానే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశానని అనంత బాబు పోలీసుల ముందు ఒప్పుకోవడంతో అంతవరకు అతనిని గట్టిగా వెనకేసుకొని వచ్చిన బొత్స సత్యనారాయణ వంటివారు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ పరిస్థితులలో వైసీపీ ప్రభుత్వం కూడా అనంతబాబుకి అండగా నిలబడలేక, అలాగని వదిలించుకోలేక కొంత ఇబ్బంది పడింది. అయితే ఓ హంతకుడిని వెనకేసుకువస్తే పార్టీకి నష్టం కలుగుమ్దని భావించి చివరికి పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకొంది.

ADVERTISEMENT

అదే సమయానికి అమలాపురంలో అల్లర్లు మొదలయ్యి నిసరసనకారులు మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్ళకు నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా అందరి దృష్టి సుబ్రహ్మణ్యం హత్య కేసు మీద నుంచి అటు వైపు మళ్ళింది. అమలాపురంలో జరిగిన ఆ అల్లర్ల వెనుక టిడిపీ, జనసేన ఉన్నాయంటూ వైసీపీ మంత్రులు, వైసీపీ నేతలే ఉన్నారంటూ టిడిపీ, జనసేనలు వాదించుకొంటున్నాయి.

ఆ అల్లర్ల వెనుక ఎవరున్నరనేది తరువాత తెలుస్తుంది. అయితే ఆ అల్లర్లతో సుబ్రహ్మణ్యం హత్య కేసును అందరూ మరిచిపోయేలా చేసిందని చెప్పవచ్చు. ఈ కేసు గురించి ప్రజలు ఎంత త్వరగా మరిచిపోతే అంత ఎవరికీ మంచిది? అని ఆలోచిస్తే సమాధానం లభిస్తుంది.

ప్రస్తుతం వైసీపీలో అందరూ కోనసీమ అల్లర్ల గురించి మాత్రమె మాట్లాడుతున్నారు కానీ ఎవరూ సుబ్రహ్మణ్యాన్ని హత్య కేసు గురించి మాట్లాడటం లేదు. ఈ కేసు గురించి ప్రజలు మరిచిపోయారు కనుక ఇక దీనిని మెల్లగా అటకెక్కించేయవచ్చని వైసీపీ ప్రభుత్వం భావిస్తోందేమో?

ఎందుకంటే, సాధారణంగా ఇటువంటి కేసులలో రిమాండ్ ఖైదీలను పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని ఆ నేరానికి సంబంధించిన వివరాలను, సాక్ష్యాధారాలను రాబడుతుంటారు. కానీ ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో అటువంటిదేమీ జరిగిన దాఖలాలు లేవు కనుక.

ADVERTISEMENT
Latest Stories