వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి ఆకస్మిక మృతి

MLC Challa Bhageerath Reddy passed Awayవైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి (46) ఈరోజు హైదరాబాద్‌, ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయారు. గత కొంతకాలంగా ఆయన న్యుమోనియాతో బాధపడుతూ నంద్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అక్కడి వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌ ఏఐజీ హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అప్పటి నుంచి ఆయనను వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈరోజు ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు.

భగీరధ రెడ్డి 2003-2009 మద్య యూత్ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2019లో తండ్రి చల్లా రామకృష్ణా రెడ్డితో కలిసి వైసీపీలో చేరారు. తండ్రి చనిపోయిన తర్వాత 2021లో ఎమ్మెల్యే కోటాలో భగీరధ రెడ్డికి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

ADVERTISEMENT

భగీరధ రెడ్డి ఆకస్మిక మృతిపట్ల సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భగీరధరెడ్డి అంత్యక్రియలు గురువారం ఉదయం నంద్యాల జిల్లా అవుకులో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

ADVERTISEMENT
Latest Stories