2019 ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు, వారి మీడియా కూడబలుక్కున్నట్లు నారా లోకేష్‌ని ఎంతగా హేళన చేశాయో అందరికీ తెలుసు.

అదే మరొకరైతే రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతారు.. భరించలేకపోతే కోడెల శివప్రసాదరావులా ఆత్మహత్య చేసుకుంటారు. నారా లోకేష్‌ని అంతగా అవహేళన చేశారు.

Also Read – గుడివాడ ఫ్లెక్సీ వివాదం..

కానీ వాటిని సవాలుగా తీసుకొని వారు తనలో చూపిన లోపాలన్నిటినీ సరిదిద్దుకొని, గోడకు కొట్టిన బంతిలా రెట్టింపు శక్తి, వేగంతో యువగళం వినిపించారు.

ఉంగరం పోగొట్టుకున్న చోటనే వెతుక్కోవాలన్నట్లు ఓడిపోయిన మంగళగిరి నుంచే పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. దొడ్డిదారిన మంత్రయ్యారనే వైసీపీ నేతలకు చెప్పుతో కొట్టినట్లు, ఎమ్మెల్యేగా గెలిచి కీలక మంత్రిత్వ శాఖలు చేపట్టారు.

Also Read – అవినాష్, అనంతబాబుని పక్కన పెట్టుకొని జనసేనపై రాళ్ళు వేస్తే..

నారా లోకేష్‌ని అంతగా అవహేళన చేసిన, చేయించిన జగన్‌ నేటికీ తెలుగులో మాట్లాడాటానికి తడబడుతూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడుని తిట్టాలన్నా కాగితం మీద వ్రాసి తెచ్చుకోవాల్సిందే. అలవాటు లేని ప్రెస్‌మీట్‌ పెట్టిన ప్రతీసారి రప్పా రప్పా మాట్లాడి దొరికిపోతూనే ఉంటారు. వ్యూహాల పేరుతో కుట్రలు చేస్తే బెడిసి కొడుతుంటాయి.

పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాల్సిన జగన్‌, చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది.. కళ్ళు మూసుకుంటే మరో నాలుగేళ్ళు ఇట్టే గడిచిపోతాయి.. ఆ తర్వాత మనమే,” అంటూ మరోసారి మభ్యపెడుతూ. ప్రజలకు, పార్టీ శ్రేణులకు దూరంగా తాడేపల్లి ప్యాలస్‌లో ఒంటరి జీవితం గడుపుతున్నారు.

Also Read – బీసీ రిజర్వేషన్స్: బీఆర్ఎస్‌లో గందరగోళం

కానీ వైసీపీ తయారుచేసిన ఆయుధం ‘మంత్రి నారా లోకేష్‌’ తన సమర్దత నిరూపించి చూపుతూ రాణిస్తూనే ఉన్నారు.

ఇటీవల ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులను, బ్రిటన్ మాజీ ప్రధానిని కలిసి మాట్లాడి వచ్చారు. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్‌లో జరిగిన కార్యక్రమానికి అద్భుతంగా ఏర్పాట్లు చేసినందుకు ప్రధాని మోడీ నారా లోకేష్‌ని మెచ్చుకుంటూ, “ఈ కార్యక్రమానికి ఇంత గొప్పగా ఏర్పాట్లు చేసినందుకు మనస్పూర్తిగా మంత్రి నారా లోకేష్‌ని అభినందిస్తున్నాను. దేశంలో రాజకీయ నాయకులందరూ ఇటువంటి కార్యక్రమాలు ఏవిదంగా నిర్వహించాలో మంత్రి నారా లోకేష్‌ని చూసి నేర్చుకోవాలి,” అని అన్నారు.




నారా లోకేష్‌ని ఈసడించిన జగన్‌, అందరినీ దూరం చేసుకొని తాడేపల్లి ప్యాలస్‌లోనే ఒంటరిగా కాలక్షేపం చేస్తూ శవరాజకీయాలతో కాలక్షేపం చేస్తుంటే, మంత్రి నారా లోకేష్‌ మాత్రం ప్రధాని మోడీ సైతం మెచ్చుకునే స్థాయికి ఎదిగిపోయారు. ప్రధాని మోడీ ప్రశంశలు వైసీపీ నేతలు, వారి మీడియాకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి చెప్పుతో కొట్టినట్లే అనిపించవచ్చు. కానీ ఇది వాస్తవమే కదా?