అవినీతి నిర్మూలన, అభివృద్ధి అనే రెండు నినాదాలతో మోడీ పవర్ లోకి వచ్చారు. గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ లేనంత మెజారిటీ తెచ్చుకుని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి వచ్చారు. సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో ఇది నిజంగా ఒక వింతే అనుకోవాలి. అయితే ప్రజల ఆశలు అడియాశలు చేసేలా ఉంది మోడీ ప్రభుత్వం.
రాజకీయ అవినీతి పరులను జీవితకాలం ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా రాజ్యాంగసవరణ చెయ్యాలని, రాజకీయ అవినీతి కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చెయ్యాలని సుప్రీమ్ కోర్ట్ కు కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. దీని పై కేంద్రం అభిప్రాయం ఏంటని సుప్రీమ్ కోర్ట్ అడిగింది.
ఎన్నికల సంఘం, సుప్రీమ్ కోర్ట్ అభిప్రాయం ఎలా ఉన్న.. ఈ విషయంలొ కేంద్ర ప్రభుత్వ వైఖరి కీలకం. ఎందుకంటే దీని కొరకు రాజ్యాంగ సవరణ చెయ్యాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వం దీని పై ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలిపింది. అవినీతి కేసులలో శిక్ష పడిన వారిని జీవిత కాలం పాటు ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా నిషేధించడానికి వ్యతిరేకించింది.
దీనితో ఢిల్లీ నుండి గల్లీ దాకా ఉన్న అవినీతి తిమింగలాలు ఊపిరి పీల్చుకున్నాయి. పలు కేసులలో కోర్టుల చుట్టూ తిరుగుతున్న రాజకీయనాయకులు హమ్మయ్య అనుకున్నారు. అయితే మార్పు తెస్తారని ఏదొ చేస్తారని మోడీ మీద గంపెడు ఆశలు పెట్టుకున్న ప్రజలు మాత్రం ఎప్పటిలానే ఏ పార్టీ ప్రభుత్వమున్న ఏమున్నది గర్వకారణం అనుకుంటు సమాధాన పడిపోతున్నారు.


