ఆ సీబీఐ, ED కేసులు ఏవో స్పీడ్ అప్ చేసి 2004-2009 మధ్య జరిగిన అవినీతిని నిరూపిస్తే వీళ్ళు కొట్టుకోవాల్సిన అవసరం ఉండదు.
లక్ష కోట్లలో ప్రభుత్వానికి చెందాల్సినది ఏదో తెల్చేసి జప్తు చేసేస్తే ఆటోమాటిక్ గా కొట్టుకునే మోటివేషన్ కూడా ఉండదు ఇద్దరికీ.
జగన్ ఏదో ఇరగదీసి సంపాదించేశాడు అనే భ్రమలో ఉన్నవారికి అలాగే వైఎస్ చెమట చిందించి లక్ష కోట్ల ఆస్తులు కూడగొట్టి పిల్లలకు ఇచ్చారేమో అనే భ్రమల్లో ఉన్నవారికి కూడా జ్ఞానోదయం చేసిన పుణ్యం కూడా మోడీ అకౌంట్ లోనే పడుతుంది.
అలాగే అవినీతి సొమ్ముతో పేపర్, ఛానెల్ పెట్టి వాటిని అడ్డం పెట్టుకుని రాజకీయాలను, ఎన్నికలను ప్రభావితం చేసే దారుణం నుండి కూడా ఆంధ్రప్రదేశ్ ను విముక్తి చేసిన వారు అవుతారు.
ఇవన్నీ కాకుండా మత మార్పిడులు ప్రోత్సహించే రాజకీయం నుండి హిందూ ధర్మాన్ని కాపాడిన వారు కూడా అవుతారు. అన్నిటికంటే ఎక్కువగా వైఎస్ విజయలక్ష్మి గారికి ఈ మానసిక వ్యథ నుండి కాపాడిన వారు అవుతారు.
దానికి మోడీ పెద్దగా చెయ్యాల్సింది ఏమీ లేదు. CBI, ED లను తమ పని తమను చెయ్యని స్తే చాలు. ఏదైనా చెయ్యాలి అనిపిస్తే మాత్రం విచారణకు ఒక మంచి నిజాయతీ కలిగిన అధికారిని, ఆ కేసులను వాదించడానికి సీబీఐ కోర్టులో నలుగురు మంచి లాయర్లు ను నియమిస్తే చాలు.




