షాకింగ్ – బౌలర్ షమీపై సంచలన ఆరోపణలు!

Mohammed Shami in extra-marital affairముస్లిం యువతీ అయ్యుంది మోడ్రన్ కాస్ట్యూమ్స్ ఏంటి? అంటూ వివిధ సందర్భాలలో టీమిండియా బౌలర్ సతీమణి హాసిన్ జాహన్ నెటిజన్లకు సుపరిచితమే. ఆ సమయంలో తన భార్యను వెనుకేసుకు వచ్చిన షమీపై నేడు హాసిన్ సంచలన ఆరోపణలు చేసింది. షమీకి ఇంతకు ముందే పాకిస్తాన్ మహిళతో వివాహం జరిగిందని, ఆమె కోసం ఓ సారి పాకిస్తాన్ కూడా వెళ్లివచ్చాడని షాకింగ్ కామెంట్స్ ఒక్కసారిగా క్రీడా ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసాయి.

ADVERTISEMENT

ఈ ఆరోపణలు ఇంతటితో ఆగితే పర్లేదు. కానీ షమీ ఏ మ్యాచ్ ఆడడానికి వెళ్ళినా కుల్ దీప్ అనే వ్యక్తి అతనికి మహిళలను సప్లై చేస్తాడని, ఈ విషయం బీసీసీఐకు కూడా తెలిసినా అతనిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించింది. ఇవన్నీ తాను బయట పెడతానేమోనని తనను చంపడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపింది. గత రెండేళ్ళుగా తనను షమీ కుటుంబం వేధింపులకు గురి చేస్తోందని హసీన్ చెప్పిన సంగతులు హాట్ హాట్ గా మారాయి.

దేశంలో చాలా మంది మహిళలతో షమీకి శారీరక అనుబంధం ఉందని అన్న హాసీన్, తన భర్త మొబైల్ నిండా ఉన్న అసభ్యకర సందేశాలు, ఫోటోలు చూడడానికి తనకు ఒక రాత్రంతా సరిపోలేదని, అలాగే కారులో గర్భ నిరోధక మాత్రలు కూడా చూశానని చెప్పింది. ఫైనల్ గా తాను న్యాయపరమైన చర్యలకు దిగుతానని హాసీన్ స్పష్టం చేసింది. 2014లో జరిగిన వీరి ప్రేమ వివాహానికి ఫలితంగా ఓ కుమార్తె కూడా ఉంది.

ADVERTISEMENT
Latest Stories