మోహన్ బాబును జగన్ కనికరిస్తారా?

Mohan Babu - YS Jaganఎంతోకాలంగా ప్రచారం కల్పిస్తూ ‘కలెక్షన్ కింగ్’ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన “సన్నాఫ్ ఇండియా” సినిమా ఎట్టకేలకు విడుదలకు నోచుకుంది. ఈ నెల 18వ తేదీన విడుదల చేయబోతున్నామని చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ద్వారా ఖరారు చేసింది.

అయితే ఏపీలో కరోనా నిబంధనల సడలింపు గానీ, టికెట్ ధరల అంశం ఓ కొలిక్కి రాకుండానే మోహన్ బాబు తన సినిమా విడుదల తేదీని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. జగన్ కు అత్యంత ఆప్తుడు అయినటువంటి మోహన్ బాబుకు ‘జగన్ అండ్ కో’ నుండి ఏమైనా అభయ హస్తం లభించిందా?

ADVERTISEMENT

ఏపీలో సినీ ఇండస్ట్రీకి అవరోధాలుగా మారిన ఈ రెండు అంశాలలో ఏ ఒక్క దాని పైన అయినా జగన్ సర్కార్ సానుకూలంగా స్పందించినా, అది మోహన్ బాబు సినిమా కంటే, తదుపరి వారం రిలీజ్ కు సిద్ధంగా ఉన్న పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్”కు అనుకూలంగా మారనుంది.

మరి మోహన్ బాబు ద్వారా పవన్ కళ్యాణ్ కు మార్గం సుగమం చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల సంక్రాంతికి జగన్ కు సన్నిహితంగా ఉన్న నాగార్జున సినిమా రిలీజ్ ఉండడంతో, ఓ అయిదు రోజుల పాటు కరోనా నిబంధనలను సడలించిన విషయం తెలిసిందే.

నేరుగా సినిమా కోసం అని చెప్పకపోయినా, ‘బంగార్రాజు’ కోసమే కరోనా ఆంక్షలను వాయిదా వేసారన్న ప్రచారం జోరుగా సాగింది. మరి అదే మాదిరి మోహన్ బాబు “సన్నాఫ్ ఇండియా”కు కూడా సదుపాయాలు కల్పిస్తే, సిల్వర్ స్క్రీన్ పైన శివతాండవం చేయడానికి పవన్ సిద్ధంగా ఉన్నారు.

జగన్ ఎప్పుడు నైట్ కర్ఫ్యూ ఎత్తివేస్తే అప్పుడు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ “భీమ్లా నాయక్” ప్రొడ్యూసర్ ప్రకటించిన విషయం తెలిసిందే. మోహన్ బాబు సినిమాకు టికెట్ ధరల విషయం పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ, నైట్ కర్ఫ్యూ ఎత్తివేస్తే ఊరటనిచ్చినట్లే!

‘బంగార్రాజు’ సినిమా మాదిరి మోహన్ బాబు సినిమాకు కూడా కరోనా ఆంక్షలను సడలిస్తే… తమకు అనుకూలంగా ఉన్న వారి సినిమాకు ఒక మాదిరి, తమకు వ్యతిరేకంగా ఉన్న వారి సినిమాలను మరో విధంగా చూస్తున్నారన్న టాక్ బలపడుతుంది. ఇది జరిగితే రాజకీయంగా వైసీపీ బలహీనపడినట్లుగానే భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories