మూడ్ ఆఫ్ ఆంధ్రా….ఎవరి కళ్ళల్లో ఆనందం కోసమో ..?

Mood of Andhra Survey Sparks Political Debate in Andhra Pradesh

2024 ఎన్నికల కోసం వైసీపీ వై నాట్ 175 అంటూ ప్రత్యర్థుల మానసిక స్తైర్యాన్ని దెబ్బకొట్టే దిశగా రాజకీయం చేసింది. కట్ చేస్తే చివరికి 11 సీట్లతో వైసీపీ కనీస ప్రతిపక్ష హోదా కూడా లేని ఫలితాలను పొందింది. ఇక ఇప్పుడు కూడా ఇదే తరహా రాజకీయంతో ‘మూడ్ ఆఫ్ ఆంధ్రా’ అంటూ సార్వత్రిక ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందే ‘కూటమి ఓటమి’ అంటూ రాజకీయం షురూ చేస్తుంది.

మూడ్ ఆఫ్ ఆంధ్రా సర్వే లో సంచలన ఫలితాలు అంటూ వైసీపీ అనుకూల మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో ఆ సర్వే ఫలితాలను ప్రచారం చేస్తూ ఆ పోస్టులను వైరల్ చేస్తున్నారు. హైద్రాబాద్ ఐఐటీయన్స్ గ్రూప్, ఆత్మ సాక్షి నిర్వహించినట్లు తెలుపుతున్న ‘మూడ్ ఆఫ్ ఆంధ్రా’ సర్వేలో కూటమి ప్రభుత్వం పై ప్రజలలో తీవ్ర సంతృప్తి, వ్యతిరేకత మొదలయ్యింది అంటూ ప్రచారం మొదలుపెట్టింది.

ADVERTISEMENT

వైసీపీ – 44%, కూటమి – 40%, సీఎం గా జగన్ కు 44% జై కొడితే 32% మంది బాబు కి మద్దతు పలుకుతున్నారని, పవన్ కి 6% ఉంటే లోకేష్ కి 5% ప్రజల సపోర్ట్ ఉందంటూ సర్వే వివరాలను ప్రచారం చేస్తున్నారు. ఇక కూటమి vs వైసీపీ గా ఎన్నికల బరిలోకి దిగితే వైసీపీ కి 83 సీట్లు, కూటమి కి 62 సీట్లని, మిగిలిన ఆ 30 స్థానాలలో హోరాహోరీ పోటీ నడుస్తుందంటూ సర్వే ఫలితాలు చెపుతున్నాయి.

అలా కాకుండా కూటమి పొత్తులు లేకుండా బరిలోకి దిగితే వైసీపీ 110 – 112 సీట్లలో విజయం సాధించి జగన్ 2.0 ఆశలను నిజం చేసుకుంటుందంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఇక జిల్లాల వారీగా చూసుకున్నా ఎక్కడ తగ్గేదెలా అన్నట్టుగా ఉత్తరాంధ్రలో మొత్తం 34 స్థానాలకు గాను అందులో 17 వైసీపీ 13 కూటమి మిగిలిన ఆ 4 స్థానాలలో నువ్వా నేనా అంటూ టఫ్ పోటీ ఉండబోతుందంటూ

ఇక రాయలసీమలోను సేమ్ సీన్ అన్నట్టుగా మొత్తం 52 స్థానాలకు గాను 29 వైసీపీ, కూటమి14 మిగిలిన 9 స్థానాలలో హోరాహోరి అని, అలాగే ఇటు ఉభయగోదావరి, కోస్తాంధ్ర జిల్లాలకు సంబంధించి మొత్తం 89 నియోజకవర్గాలుంటే 37 స్థానాలలో వైసీపీ, 35 స్థానాలలో కూటమి జై కేతనం ఎగరేస్తుందని ఆ మిగిలిన 17 స్థానాలలో కూడా వైసీపీ, కూటమి మధ్య నువ్వా నేనా అన్న స్థాయిలో పోటీ ఉంటుందంటూ మూడ్ ఆఫ్ ఆంధ్రా సర్వే లెక్కలను ప్రచారం చేస్తూ వైసీపీ అనుకూల మీడియా కూటమి ఓటమిని ఇప్పుడే నిర్దేశించేస్తుంది.

అయితే ఇక్కడ వైసీపీ అనుకూల మీడియా ఒక్క విషయంలో మాత్రం తన నిజాయితీని నిరూపించుకుంటుందని చెప్పక తప్పదు. గత ఎన్నికలలో వైసీపీ కన్న వై నాట్ 175 కల 2029 లో నిజం కాబోతుంది అంటూ ఈ సర్వే ఫలితాలను తీర్చి దిద్దకపోవడం ఆ సర్వే ల నిజాయితీకి అద్దం పడుతుందంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

వైసీపీ కళ్ళలో ఆనందం కోసమే ఈ సర్వేలని, వైసీపీ ఐప్యాక్ రాజకీయాలలో భాగమే ఈ మూడ్ ఆఫ్ ఆంధ్రా అంటూ కూటమి మద్దతుదారులు సోషల్ మీడియాలో వైసీపీ పై ట్రోల్స్ చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories