మోత్కుపల్లి బాధ అసలు కారణం ఇదా?

motkupalli narasimhulu allegations on chandrababu naiduతెరాసలో జాయిన్ కావడానికి రంగం సిద్ధం చేసుకున్న మోత్కుపల్లి నరసింహులు వెళ్లే ముందు నాటకాన్ని మరింత రక్తి కట్టించే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ జయంతి రోజున ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేస్తూ చంద్రబాబుని తూలనాడుతూ పార్టీ ఫిరాయించడానికి సిద్ధం అయిపోయారు. మీడియా ముందు కనీళ్ళు పెట్టుకుంటూ చంద్రబాబుని తూలనాడారు.

అయితే మోత్కుపల్లి ఉన్నఫళంగా ఇలా చెయ్యడానికి కారణం ఉందంట. ఈ సంవత్సరం మొదట్లో టీడీపీ బీజేపీని వీడటానికి సిద్ధం అయినప్పుడు చివరి అస్త్రంగా మోత్కుపల్లికి గవర్నర్ గిరి ఇస్తామని కమలనాధులు వర్తమానం పంపారట. అయితే ప్రత్యేక హోదా సెంటిమెంట్ ప్రజలలో ఉండగా పదవులు తీసుకుంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని చంద్రబాబు వద్దన్నారట.

ADVERTISEMENT

దీనితో మోత్కుపల్లికి భవిష్యత్తు మీద బెంగ వచ్చి ఇప్పుడు కారు ఎక్కడానికి సిద్ధం అవుతున్నారు. పార్టీ భవిష్యత్తు కాదని తనకు గవర్నర్ గిరి ఇప్పించమన్న మోత్కుపల్లి విధేయత ఏ మాత్రమో ఇట్టే అర్ధం అయిపోతుంది. ఇప్పుడు చంద్రబాబును గట్టిగా తిట్టి వస్తే కేసీఆర్ అందలం ఎక్కిస్తారనుకుంటున్నారేమో!

ADVERTISEMENT
Latest Stories