ఇంకా చాలా ఉన్నాయి….దాచుంచామ్!

Raghu Rama Krishna Raju

వైసీపీ పార్టీకి కొరకరాని కొయ్యగా తయారయ్యారు నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ RRR . వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై కొత్త కొత్త కేసులతో కోర్టులో పిటిషన్లు వేస్తుంటే.,RRR మాత్రం జగన్ మీద ఉన్న పాత కేసులన్నిటి దుమ్ము దులుపుతూ మళ్ళీ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.

కొత్త కేసులతో టీడీపీ అధినేతని ఇరుకునపెట్టాలని చూస్తున్న తన అధినేతకు ఆయన మీద ఉన్న పాత కేసులతోనే చెక్ పెట్టె పనిలో ఉన్నారు ఆర్ఆర్ఆర్. ఇప్పటికే పనులు మొదలుపెట్టారు కూడా. అయితే తాజాగా రఘురామా మాట్లాడుతూ “ఇక్కడితో అయిపోలేదు తమ్ముడు ఇంకా చాల దాచుంచా” మీకోసం 2024 లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ మీద వేసిన…,వేయాల్సిన కేసుల లిస్ట్ చాలా పెద్దగా ఉండబోతుంది అంటూ వైకాపా నాయకులను హెచ్చరిస్తున్నారు.

ADVERTISEMENT

బాబు హయాంలో ప్రజలకు ఇసుకను ఉచితంగా ఇచ్చారంటు తలాతోకా లేని కేసులు వేసిన ఈ ప్రభుత్వం తన ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణకు సిద్దపడగలదా? వాలంటీర్లందరూ మన కార్యకర్తలే అంటూ ఒకరు, మాకు నచ్చకపోతే వాలంటీర్లను మార్చుకుంటాం అంటూ మరొక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలన్నీ ఆధారాలుగా చూపిస్తూ వైసీపీ ప్రభుత్వంపై కూడా కేసులు వేస్తాం. ‘ఇంకా చాలా ఉన్నాయి …. దాచుంచామ్’! అంతే.

పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ ఖజానా నుండి జీతాలు ఎలా ఇస్తారు? ఇదికదా అక్రమం, ఇక్కడ జరగలేదా అవినీతి. ప్రభుత్వ పదవిలో ఉన్న మీరు వాలంటీర్ల ద్వారా సాక్షి పేపర్ కొనుగోళ్లు చేయిస్తూ మీ పత్రిక ఆదాయాన్ని,వ్యాపారాన్ని పెంచుకోవడం చట్ట రీత్యా నేరమేగా. పాలసీ మార్పు అంటూ ఇసుక మీద, మద్యం మీద మీరు చేసే అవినీతిని ప్రశ్నిస్తున్నందుకా
తిరిగి బాబుపై కేసులు పెడుతుంది అంటూ తన పార్టీ నేతల పై తానూ పెట్టిన, పెట్టబోయే కేసుల లిస్టు చదువుతున్నారు రఘురామా కృష్ణ రాజు.

ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి A1 మరియు A2 బైలు రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించడం జరిగింది. ముఖ్యంత్రి పదవి కోల్పోతే ఇక జగన్ పరిస్థితి RRR ఊహలకు తగ్గట్టుగా మారుతుందా? అనే సందేహాలు వైసీపీ నేతలలో కూడా మొదలయ్యే రోజు దగ్గర్లోనే ఉందంటున్నారు వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకులు.

ADVERTISEMENT
Latest Stories