Mudragada Padmanabham’s Health: Daughter Kranthi vs Son Giri Clash

తండ్రి..కూతురు…ఓ క్యాన్సర్…!

ముద్రగడ కుటుంబంలో నాడు మొదలైన రాజకీయ చిచ్చు రోజురోజుకి దాని పరిధిని విస్తరించుకుంటుంది అనేలా ఆయన కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. తాజాగా తన తండ్రి ముద్రగడ క్యాన్సర్ బారిన పడ్డారు అంటూ ముద్రగడ కుమార్తె క్రాంతి తన సోషల్ మీడియా వేదికగా విషయాన్ని బహిర్గతం చేసారు.

Also Read – వైఎస్ స్పూర్తి.. వద్దు పైనున్న ఆయన బాధపడతారు!

ముద్రగడ ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేదని, ఆయనకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి వచ్చినప్పటికీ ముద్రగడ కుమారుడు, తన అన్న గిరి ఆయనకు మెరుగైన వైద్యం అందించడం లేదని, తన తండ్రి ఆరోగ్య పరిస్థితి పై పూర్తి గోప్యత పాటిస్తూ తనకు గాని, ముద్ర కుటుంబంలోని ఇతర సభ్యులకు కానీ ఎటువంటి సమాచారం అందించడం లేదంటూ గిరి పై తీవ్ర ఆరోపణలు చేసారు క్రాంతి.

అలాగే ముద్రగడ ను కలిసేందుకు కూడా గిరి అతని మామ ఆంక్షలు పెడుతున్నారంటూ ముద్రగడ తాజా పరిస్థితి ఇది అనేలా క్రాంతి చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. దీనితో ముద్రగడ ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీయడం, అసలు ఆయనకు ఏమైంది అంటూ స్థానిక ప్రజల్లో ఆందోళన రేకెత్తడంతో చివరికి ముద్రగడ ప్రకటన ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read – యుద్ధం మద్యలో ఈ బేరాలేంటి ట్రంప్‌ గారు?

అయితే తన ఆరోగ్యం మీద తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు కానీ, తన కుమారుడు గిరి పై చేసిన ఆరోపణలలో కానీ అసలు వాస్తవాలు లేవని, అసలు తనకు క్యాన్సర్ రాలేదని, కేవలం వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలతోనే తానూ ఇబ్బంది పడుతున్నట్టు ముద్రగడ ఒక ప్రకటన విడుదల చేసారు. గిరి తనను నిర్బంధిస్తున్నాడు అంటూ వచ్చిన ఆరోపణలలో వాస్తవం లేదంటూ ఖండించారు.

తానూ ప్రతి రోజు స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటున్నాని, ఇవన్నీ కూడా గిరి ఎదుగుదల చూడలేక తన పై తన కుటుంబం పై జరుగుతున్న రాజకీయ దాడి అంటూ ముద్రగడ మండిపడుతున్నారు. అయితే ఇక్కడ ముద్రగడ ఆరోగ్యం పై ఆయన కుమార్తె చేస్తున్న ఆరోపణలలో వాస్తవం ఉందా.? లేక ముద్రగడ ఇస్తున్న వివరణలో సత్యం ఉందా అనే విషయంలో ఇప్పుడే ఒక నిర్దారణకు రాలేకపోతున్నారు.

Also Read – ఇలా అయితే ఎలా కవితక్కా?


వైసీపీ, జనసేన తో మొదలైన ముద్రగడ కుటుంబంలోని రాజకీయ చిచ్చు ఇప్పుడు ఇలా వ్యక్తిగత సమస్యల పై కూడా రచ్చకెక్కే స్థాయికి చేరుకున్నాయి. కొడుకు ఎదుగుదల తట్టుకోలేక కూతురే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఓర్వలేని తనమంటూ ముద్రగడ క్రాంతి మీద పరోక్ష విమర్శలకు దిగి క్రాంతికి కౌంటర్ గా ఒక ప్రకటన ఇచ్చారు. ఇప్పుడు తన తండ్రి వివరణ పై కూతురు ఏ విధంగా స్పందిస్తుందో.?