ఏపీకి గ్రోత్ ఇంజన్ కాబోతున్న మారుమూల గ్రామం!

Mulapeta Port to Transform Srikakulam Growth

ఏపీలో వెనుకబడిన జిల్లాలలో శ్రీకాకుళం ఒకటి. దానిలో ఓ మారుమూల గ్రామం సంతబొమ్మాళి! చాలా మందికి ఈ ఊరు పేరు కూడా తెలిసి ఉండదు.

అలాంటిచోట మూలపేట పోర్టు వస్తోంది. దానికి అనుబంధంగా ఓ భారీ పారిశ్రామికవాడ… వాటిని కలుపుతూ కొత్తగా రైల్వేలైన్, రోడ్లు నిర్మించబోతున్నారు. అలాగే అక్కడే ఓ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కూడా ఏర్పాటు కాబోతోంది.

ADVERTISEMENT

కనుక ఇప్పుడు ఆ మారుమూల గ్రామం రైల్, రోడ్, సముద్రం, వాయు మార్గాల ద్వారా యావత్ దేశం, ప్రపంచంతో కనెక్ట్ కాబోతోంది!

అక్కడ ఇవన్నీ ఏర్పాటయితే ఇంత కాలంగా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాయే ఆంధ్రప్రదేశ్‌కి ఓ కొత్త ‘గ్రోత్ ఇంజన్’ కాబోతోంది.

రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్ధన మేరకు మూలపేట పోర్టు కోసం సమీపంలో నౌపాడలోని 385.24 ఎకరాల ‘సాల్ట్ ల్యాండ్స్’ని కేంద్ర ప్రభుత్వం ఏపీ మారిటైమ్‌ బోర్డుకి కేటాయిస్తూ త్తర్వులు జారీ చేసిందని సిఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

దీనిని రాజకీయ కోణంలో నుంచి చూసినట్లయితే… త్వరలో నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. మూలపేట పోర్టుకి భూమి కేటాయించినందుకు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీకి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కి సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

డబుల్ ఇంజిన్ సర్కార్, వికసిత్ భారత్‌ అనేవి కేవలం నినాదాలు మాత్రమే కావని ఆచరణలో ఇలా చూపిస్తున్నారని చంద్రబాబు నాయుడు చెప్పారు.

కనుక దేశవ్యాప్తంగా అందరికీ చిరపరిచితులైన ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు చేసిన ఈ ట్వీట్‌ ఎన్నికల రాష్ట్రాలలో ప్రజలకు చేర్చగలిగితే వారికీ ఎన్డీయేపై నమ్మకం ఏర్పడుతుంది. ఎన్డీయే విజయావకాశాలు పెరుగుతాయి కూడా!

ADVERTISEMENT
Latest Stories